US President On Taliban : అస్థిత్వ సంక్షోభంలో తాలిబన్..బైడెన్ సంచలన వ్యాఖ్యలు

అప్ఘానిస్తాన్ ని ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

US President On Taliban : అస్థిత్వ సంక్షోభంలో తాలిబన్..బైడెన్ సంచలన వ్యాఖ్యలు

Taliban (4)

US President On Taliban అప్ఘానిస్తాన్ ని ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాలిబన్ సంస్థ ఏ మాత్రం మారలేదని గురువారం బైడెన్ అన్నారు. ప్రపంచ వేదికపై చట్టబద్ధతను కోరుకునే విషయమై ప్రస్తుతం తాలిబన్ అస్థిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ఓఇంటర్వ్యూలో బైడెన్ తెలిపారు. అంతర్జాతీయ సమాజం ద్వారా తమది(తాలిబన్) చట్టబద్ధమైన ప్రభుత్వంగా గుర్తించాలని తాలిబన్ కోరుకుంటుందా లేదా అనేది తనకు ఖచ్చితంగా తెలియదని బైడెన్ అన్నారు.

అల్-ఖైదా మరియు దాని అనుబంధ సంస్థల నుండి అఫ్ఘానిస్తాన్ కంటే ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకే ముప్పు ఎక్కువగా ఉందని, సిరియా లేదా తూర్పు ఆఫ్రికాలో అల్-ఖైదా అనుబంధ సంస్థల వల్ల దూసుకొస్తున్న సమస్యలను విస్మరించడం హేతుబద్ధం కాదని బైడెన్ అన్నారు. ఇక, అమెరికాకు ముప్పు గణనీయంగా ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు.
ముప్పు ఎక్కడ ఎక్కువగా ఉందనే దానిపై మనం దృష్టి పెట్టాలి అని బైడెన్ అన్నారు.

అఫ్ఘానిస్తాన్ నుండి అమెరికా సేనల ఉపసంహరణ నిర్ణయాన్ని ఈ సందర్భంగా మరోసారి బైడెన్ సమర్థించుకున్నారు. అప్ఘానిస్తాన్ లోని మహిళలు మరియు బాలికల పట్ల తాలిబన్లు మరోసారి క్రూరత్వాన్ని ప్రదర్శిస్తారంటూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో బైడెన్ వాటిని తోసిపుచ్చారు. సైనిక శక్తి ద్వారా ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కులను పరిరక్షించడానికి ప్రయత్నించడం మంచిది కాదని వాదించారు. వారి(తాలిబన్) ప్రవర్తనను మార్చడానికి.. మానవ హక్కుల దుర్వినియోగదారులపై దౌత్య మరియు అంతర్జాతీయ ఒత్తిడి ద్వారా ఇది చేయాలని బైడెన్ పేర్కొన్నారు.