జో బైడెన్ ప్రమాణ స్వీకారం : భారీగా బలగాలు, హెటెన్షన్ వాతావరణం

జో బైడెన్ ప్రమాణ స్వీకారం : భారీగా బలగాలు, హెటెన్షన్ వాతావరణం

Joe Biden sworn : అమెరికా రాజధాని మిలటరీ జోన్‌గా మారింది. కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రమాణస్వీకారానికి ముందు అమెరికాలో గంభీర వాతావరణం నెలకొంటోంది. ముఖ్యంగా దేశ రాజధాని వాషింగ్టన్‌ DCలో వీధులన్నీ భద్రతా బలగాలతో నిండిపోతున్నాయి. ఇంకా ఆయా రాష్ట్రాల నుంచి దళాలు వచ్చి చేరుతున్నాయి. అలాగే 50 రాష్ట్రాల రాజధాని నగరాల్లోనూ వాతావరణం వేడెక్కింది. క్యాపిటల్‌ భవనాలపై అనునిత్యం నిఘా కొనసాగుతోంది.

ట్రంప్‌ మద్దతుదారులు ఎక్కడ మరోసారి బీభత్సం సృష్టిస్తారోననే అనుమానంతో అన్ని వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. FBI, హోంల్యాండ్ సెక్యూరిటీ ఇచ్చిన హెచ్చరికలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఏ క్షణంలోనైనా దాడులు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి నిఘావర్గాలు. రాళ్లు రువ్వడం దగ్గరి నుంచి బాంబులు పేల్చడం వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలైనా చోటుచేసుకోవచ్చని హెచ్చరికలు అందుతున్నాయి. దీంతో నిత్యం అప్రమత్తంగా ఉండి ప్రమాదాల్ని అరికట్టాలని భద్రతా విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యంగా విస్కాన్సిన్‌, మిషిగన్‌, పెన్సిల్వేనియా, అరిజోనా రాష్ట్రాల్లో తీవ్ర అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇప్పటికే వాషింగ్టన్‌లో హై టెన్షన్‌ వాతావరణం కొనసాగుతోంది. ప్రధాన కూడళ్లు, రెస్టారెంట్లు, చారిత్రక ప్రదేశాలు, ఫెడరల్‌ భవనాల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. దేశంలో ఉన్న అతివాదులే దుశ్చర్యలకు పాల్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏ క్షణంలోనైనా వీరంతా రోడ్లపైకి వచ్చి ట్రంప్‌నకు మద్దతుగా ర్యాలీలు చేపట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.