పారిస్ వాతావరణ ఒప్పందంలో తిరిగి చేరతాం…ట్రంప్ కి ఝలక్ ఇచ్చిన బైడెన్

  • Published By: venkaiahnaidu ,Published On : November 5, 2020 / 12:10 PM IST
పారిస్ వాతావరణ ఒప్పందంలో తిరిగి చేరతాం…ట్రంప్ కి  ఝలక్ ఇచ్చిన బైడెన్

Joe Biden vows to rejoin Paris climate deal అమెరికా అధ్యక్ష పీఠాన్నికైవసం చేసుకునే దిశగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు వెలువడిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలను చూస్తే…. అధ్యక్ష పీఠంపై కూర్చునేందుకు అవసరమైన 270 ఎలక్టోరల్​ ఓట్లకు గాను.. బైడెన్​ 264 ఓట్లు సాధించారు. ఇక,రిపబ్లిక్ పార్టీ నుంచి రెండోసారి అధ్యక్ష పదవికి పోటీ చేైసిన డొనాల్డ్ ట్రంప్ 214 ఎలక్టోరల్​ ఓట్లు సాధించారు. అయితే,ఈ ఎన్నికల్లో జో బైడెన్ దే విజయం అని సృష్టంగా అర్థమవుతోంది.



అయితే,అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టి వైట్ హౌస్ లోకి అడుగుపెట్టిన వెంటనే పారిస్ వాతావరణ ఒప్పందపైనే జో బైడెన్ దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలుస్తోంది. బుధవారం పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి బుధవారం ట్రంప్ సర్కార్ అధికారికంగా తప్పుకున్న కొద్ది గంటల్లోనే జో బైడెన్ నుంచి ఈ ఒప్పందం గురించి ఓ కీలక ప్రకటన వచ్చింది. ఖచ్చితంగా 77 రోజుల్లో మళ్లీ పారిస్ వాతావరణ ఒప్పందంలో బైడెన్ ప్రభుత్వం చేరబోతుందంటూ తాజాగా బైడెన్ చేసిన ట్వీట్ ఆశక్తికరంగా మారింది.



కాగా.. గ్లోబల్ వార్మింగ్‌ను సాధ్యమైనంత వరకు తగ్గించాలనే ఉద్దేశంతో ప్రపంచ దేశాల మధ్య 2015లో పారిస్ ఒప్పందం కుదురిన విషయం తెలిసిందే. అయితే ఈ చారిత్రాత్మక ఒప్పందం నుంచి అమెరికా తప్పుకుంటున్నట్లు జూన్-1,2017న ట్రంప్ ప్రకటించారు. గతేడాదే అధికారిక నోటిఫికేషన్ తో దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభం అయింది. నవంబర్-4,2020న అధికారికంగా పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది.



https://10tv.in/72-per-cent-of-indian-americans-plan-to-vote-for-joe-biden-says-survey/
అయితే,ఇటీవల ఓ ఎన్నికల ప్రచారంలో పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగడానికి సంబంధించి తన నిర్ణయాన్ని ట్రంప్ సమర్ధించుకున్నారు. ఆ ఒప్పందం వల్ల అమెరికా ఎటువంటి ప్రయోజనం లేకపోగా.. కోట్లాది రూపాయలను నష్టపోతుందని తెలిపారు. మిలియన్ల కొద్ది ఉద్యోగాలను వేలాది కంపెనీలను నష్టం పోవడం ఇష్టం లేకే.. పారిస్ ఒప్పందం నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఇటువంటి వాతావరణ ఒప్పందాల వల్ల టెక్సాస్, ఓక్లాహోమా వంటి చమురు రాష్ట్రాలకు ఆర్థిక విపత్తు ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు. అమెరికాలో స్వచ్ఛమైన గాలి, నీరు ఉందని.. కార్బన్ ఎమిషన్స్ కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉందన్నారు. వాతావరణ మార్పులను పరిష్కరించడానికి డెమొక్రాటిక్ అభ్యర్థి బిడెన్ ప్రణాళికలను ఆయన తప్పుబట్టిన విషయం తెలిసిందే.