America : బైడెన్ పెంపుడు కుక్క మృతి

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పెంచుకున్న శునకం ఛాంప్ (13)చనిపోవడంతో కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. దీనిని బైడెన్ ఫ్యామిలీ..ఆత్మీయంగా పెంచుకున్నారు. 2008 సంవత్సరంలో అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో...చిన్న పిల్లగా ఉన్న ఛాంప్ ని బైడెన్ ఓ వ్యాపారి నుంచి సేకరించారు.

America : బైడెన్ పెంపుడు కుక్క మృతి

Joe Biden

Joe Biden’s Dog Champ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పెంచుకున్న శునకం ఛాంప్ (13)చనిపోవడంతో కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. దీనిని బైడెన్ ఫ్యామిలీ..ఆత్మీయంగా పెంచుకున్నారు. 2008 సంవత్సరంలో అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో…చిన్న పిల్లగా ఉన్న ఛాంప్ ని బైడెన్ ఓ వ్యాపారి నుంచి సేకరించారు. అప్పటి నుంచి బైడెన్ కుటుంబంలో ఒకటిగా అయిపోయింది. వయోభారంతో అది చనిపోవడంతో బైడెన్ దంపతులు భావోద్వేగానికి గురయ్యారు.

ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. తాము దు:ఖంలో ఉన్న రోజుల్లో..ఆనందంగా ఉన్న సమయంలో..ఛాంప్ తమ వెంటే ఉందనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తమ భావోద్వేగాల్లో భాగస్వామి అయ్యిందని ట్వీట్ లో వెల్లడించారు. డెలావర్ లో ఉన్న బైడెన్ స్వగృహంతో పాటు..శ్వేతసౌధంలోనూ ఛాంప్ కు ప్రత్యేక స్థానం ఉండేది. ఛాంప్ చనిపోవడంతో మరో శునకం మేజర్ ఒంటరి అయ్యింది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో…వైట్ హౌస్ లో పెంపుడు జంతువులకు అనుమతి లేదనే విషయం తెలిసిందే. అనంతరం బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికయిన అనంతరం…బైడెన్ అలాంటి విధానాలను మార్చేస్తున్నారు.