జో బైడెన్ కొత్త మంత్రివర్గం : మహిళ చేతిలో ఆర్థిక శాఖ

  • Published By: madhu ,Published On : November 25, 2020 / 08:20 AM IST
జో బైడెన్ కొత్త మంత్రివర్గం : మహిళ చేతిలో ఆర్థిక శాఖ

Joe Biden’s new cabinet : అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తన మంత్రి వర్గాన్ని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో కలిసి ఏర్పాటు చేశారు. ఏడుగురు సభ్యులతో కూడిన టీమ్‌ను ప్రకటించారు. ఇందులో పార్టీలో ఎంతో కాలంగా పనిచేస్తున్న నేతలతో పాటు గతంలో తనతో పాటు పనిచేసిన వారికి, సన్నిహితంగా ఉన్నవారికి అవకాశం కల్పించారు. ముందునుంచి ఊహించినట్లుగానే విదేశీ వ్యవహారాల శాఖను అంటోనీ బ్లింకెన్‌కు కేటాయించారు. గతంలో బ్లింకెన్ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా పనిచేశారు.



అంతేగాకుండా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా ఒబామా కాలంలో పనిచేశారు. దేశ అంతర్గత భద్రత శాఖ మంత్రిగా అలెజాండ్రో మయోర్కాస్‌ను నియమించారు. నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా అవ్రిల్ హైన్స్‌కు బాధ్యతలు అప్పగించారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా జేక్ సల్లివన్‌ను నియమించారు. ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్‌ను ఎంపిక చేశారు. ఆర్థిక శాఖ బాధ్యతలను జానెట్ ఎలన్‌కు అప్పగించారు. అమెరికా చరిత్రలో ఆర్థిక శాఖను చేజిక్కించుకున్న మహిళగా ఎలన్ రికార్డు సృష్టించారు.



https://10tv.in/pope-francis-calls-chinas-uighur-muslims-persecuted-for-first-time/
ఒబామా కాలంలో విదేశాంగశాఖ మంత్రిగా పనిచేసిన జాన్ కెర్రీకి కీలక బాధ్యతలు అప్పగించారు. వాతావరణం కోసం ప్రత్యేక అధ్యక్ష రాయబారిగా బాధ్యతలు అప్పగించారు. 2004 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కాగా ప్రస్తుతం ఉన్న టీమ్‌లో అందరూ ఒబామా – బిడెన్ కాలంలో పనిచేశారు.