శ్రీనగర్‌లో జో బిడెన్ ప్రమాణ స్వీకారోత్సవ సంబరాలు: లింకు ఉంది గురూ..

శ్రీనగర్‌లో జో బిడెన్ ప్రమాణ స్వీకారోత్సవ సంబరాలు: లింకు ఉంది గురూ..

Joe Biden: యూఎస్ నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ (ఎన్ఈసీ) డిప్యూటీ డైరక్టర్‌గా సమీరా ఫజిలీని నియమించారు ప్రెసిడెంట్ గా ఎన్నికైన జో బిడెన్. శ్రీనగర్‌లో బంధువులు ఉన్న మిస్ ఫజిలీకి పదవి దక్కడం పట్ల ఆమె బంధు వర్గం సంబరాలు మొదలుపెట్టేశారు. ఆమెకు ఆంటీ అయ్యే మహిళ 70సంవత్సరాల వయస్సులో శ్రీనగర్ లోని హవాల్ ఏరియాలో ఇంటి వద్దనే సెలబ్రేషన్స్ జరిపారు.

ఆ వార్త విన్నప్పటి నుంచి సీఎన్ఎన్ టెలివిజన్ ఛానెల్ ను వదిలిపెట్టకుండా చూస్తున్నాం. ఆమె తల్లితో నిన్ననే మాట్లాడా. వారంతా గర్వంగా ఫీలవుతున్నారు. కానీ, సమీ చాలా బిజీగా ఉన్నారు. ఆ కుటుంబానికే ఇది గొప్ప క్షణం. ఆమె చాలా ఎక్స్‌టార్డినరీ. తన ఆసక్తి నెరవేర్చుకోవడం కోసం మెడికల్ స్కూల్ మానేసింది’ అని మిస్. మెహమూదా అన్నారు.

కశ్మీర్ దంపతులు ముహమ్మద్ యూసఫ్ ఫజిలి, రఫికా ఫజిలీలకు గోజ్వారా సిటీకి చెందిన ఫజిలీ తన కెరీర్ ను యలె లా స్కూల్ కమ్యూనిటీ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ క్లినిక్ లో క్లినికల్ లెక్చరర్ గా స్టార్ట్ చేశారు.

మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా నేతృత్వంలో పనిచేసి చాలా పాపులర్ అయ్యారు. ఆమె ఆఫీస్ వదిలివెళ్లే సమయంలో ఒబామా ఫేర్ వెల్ పార్టీ ఏర్పాటు చేసి ఫజిలీ కుటుంబానికి ట్రీట్ ఇచ్చారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫజిలీ సీనియర్ అడ్వైజర్ గా వైట్ హౌజ్ లోని ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. ఆ తర్వాత ఆమె ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ అట్లాంటా డైరక్టర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఫర్ ద కమ్యూనిటీ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ లో పనిచేశారు.

ఫజిలీ తనకు కశ్మీర్ తో ఉన్న సంబంధాన్ని ప్రతిబింబించేలా తన కూతురికి జూన్ అని పేరు పెట్టారు. కశ్మీర్ లోనే ట్రాజిక్ క్వీన్.. చివరి కశ్మీరీ కింగ్ యూసఫ్ షా చాక్ కు భార్య పేరు జూన్(హబ్బా ఖతూన్).