జాన్సన్ అండ్ జాన్సన్‌ రూ.890కోట్లు చెల్లించాలని కోర్ట్ ఆర్డర్

జాన్సన్ అండ్ జాన్సన్‌ రూ.890కోట్లు చెల్లించాలని కోర్ట్ ఆర్డర్

Johnson & Johnson: జాన్సన్ & జాన్సన్ 120మిలియన్ అమెరికన్ డాలర్లు (రూ.890కోట్లు) చెల్లించాలని ఆర్డర్ వేసింది. పౌడర్ కేసులో అయిన డ్యామేజి నిమిత్తం బ్రూక్లిన్ మహిళ, ఆమె భర్తకు డబ్బులు అందజేయాలని ఆదేశాలిచ్చింది. బ్రూక్లిన్ మహిళ ఈ కంపెనీకి చెందిన పౌడర్ రాసుకోవడం వల్లనే క్యాన్సర్ వచ్చిందని ఆరోపణలపై విచారణలో ఈ తీర్పు వెలువడింది.

స్టేట్ సుప్రీం కోర్టు జస్టిస్ గెరాల్డ్ లేబవిట్స్ గతంలో వేసిన 325 మిలియన్ డాలర్లను 120మిలియన్ డాలర్లకు తగ్గించారు. బుధవారం ఈ అమౌంట్ ను జడ్జి ఆమోదించారు. ఇందులో 15మిలియన్ డాలర్లు తిరిగి రాని ఖర్చులు కాగా 105 మిలియన్ డాలర్లు శిక్షా సంబంధమైన ఖర్చులు.



తమకు ఆమోదం కాని పక్షంలో జాన్సన్ అండ్ జాన్సన్ మరోసారి కోర్టు మెట్లు ఎక్కనుంది. ‘క్యాన్సర్ తో బాధపడేవారి గురించి మా సానుభూతిని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ విషయాలు చాలా ముఖ్యం. మా పౌడర్ చాలా సేఫ్ అని, ఆస్బెస్టస్ రహితమైన ప్రొడక్ట్ అని క్యాన్సర్‌కు కారణం కాదనే నమ్మకంతో ఉన్నట్లు చెప్పారు.

జాన్సన్ అండ్ జాన్సన్ కు వ్యతిరేకంగా వాదించిన లాయర్ మాత్రం ఇప్పుడు వచ్చిన ఫలితంతో తాము సంతృప్తి చెందినట్లు చెబుతున్నారు.