బిగుస్తున్న ఉచ్చు…ట్రంప్ అభిశంసనపై ఓటింగ్

  • Published By: venkaiahnaidu ,Published On : December 12, 2019 / 11:56 AM IST
బిగుస్తున్న ఉచ్చు…ట్రంప్ అభిశంసనపై ఓటింగ్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్​పై యూఎస్​ హౌస్ జ్యుడిషియరీ కమిటీ.. బుధవారం ప్రారంభించిన అభిశంసన ప్రక్రియ ఇవాళ(డిసెంబర్-12,2019)ముగియనుంది.

ఇవాళ అభిశంసన తీర్మానంపై చర్చ అనంతరం అభిశంసన అభియోగాలపై ఓటింగ్​ జరపనున్నారు. ట్రంప్ అధికార దుర్వినియోగానికి, అమెరికన్​ కాంగ్రెస్ కార్యకలాపాలను ఆటంకపరిచేందుకు ప్రయత్నించారని డెమొక్రాట్లు అభియోగాలు మోపి.. అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

వీటిపై జ్యుడిషియరీ కమిటీ చర్చించి అవసరమైన సవరణలు చేసే అవకాశం ఉంది.ట్రంప్​పై అభిశంసన తీర్మానానికి సవరణలు చేయాలని రిపబ్లికన్లు ప్రతిపాదిస్తున్నారు. ఇందు కోసం 9 పేజీల సవరణ ప్రతిపాదనలు రూపొందించారు. అయితే డెమొక్రాట్లు ఇందుకు అంగీకరించే అవకాశాలు కనిపించడం లేదు.

ట్రంప్.. 2020 ఎన్నికల్లో తన స్వప్రయోజనాల కోసం ప్రత్యర్థుల్ని అణగదొక్కే ప్రయత్నాల్లో ఉన్నారని ఆరోపిస్తున్నారు. డెమొక్రాట్ల అభియోగాలను పరిశీలించి అభిశంసన తీర్మణాన్ని హౌస్​ ఫ్లోర్​కు పంపడానికి ఓటింగ్​ జరుపుతుంది. ఇవాళ రాత్రి ఈ ఫలితాలు వెలువడనున్నాయి.