2020జూన్ నాటికి…పాక్ లో ప్రతి 10మందిలో 4గురు పేదరికంలోకి

  • Published By: venkaiahnaidu ,Published On : December 11, 2019 / 12:27 PM IST
2020జూన్ నాటికి…పాక్ లో ప్రతి 10మందిలో 4గురు పేదరికంలోకి

రెండేళ్ల ఇమ్రాన్ ఖాన్ పాలనలో పాక్ ఆర్థికపరిస్థితి మరింత దిగజారిపోయిందని ప్రముఖ ఎకనామిస్ట్ హఫీజ్ ఏ పాషా అన్నారు. పాకిస్తాన్ లో దిగజారిన ఆర్థికవృద్ధి,రెండంకెల ఆహార ద్రవ్యోల్బణం కారణంగా 2020 జూన్ నాటికి దేశంలోని ప్రతి 10మందిలో 4మంది పేదరికంలోకి వెళ్లిపోతారని ఆయన అన్నారు.

గతంలో పాక్ ఆర్థికమంత్రిగా,ఇమ్రాన్ ఖాన్ కు సలహాదారుడిగా పనిచేసిన హఫీజ్ ఏ పాషా…ఇప్పటికే పీటీఐ ప్రభుత్వం మొదటి ఏడాది చివరినాటికి 80లక్షల మంది పేదల ర్యాంక్ లో చేర్చబడ్డారని తెలిపారు. ప్రస్తుత ఆర్థికసంవత్సరం చివరినాటికి మరో 10లక్షల మంది అదనంగా అత్యంత పేదరికం జాబితాలోకి వెళ్లిపోనున్నట్లు తెలిపారు.

జనాభా వృద్ధి రేటుకు దగ్గరగా ఉన్న ఆర్థిక వృద్ధి రేటు మరియు పాడైపోయే ఆహార పదార్థాల ధరలలో విపరీతమైన పెరుగుదల కారణంగా పాక్ పరిస్థితి పరిస్థితి చాలా భయంకరంగా ఉందని పాషా తెలిపారు. అయితే దీనిపై ఆయన ప్రభుత్వ వెర్షన్ ని తీసుకునేందుకు ప్రయత్నించగా,తమ దగ్గర ఇటీవలకాలంలోని అధికారిక పేదరిక లెక్కలు లేవని ప్లానింగ్ అండ్ డెవలప్ మెంట్ ఫెడరల్ మినిస్టర్ అసద్ ఉమర్ తెలిపినట్లు సమాచారం.