ట్రంప్ పై ఏమంటారని అడిగితే….మూగబోయిన కెనడా ప్రధాని

  • Published By: venkaiahnaidu ,Published On : June 3, 2020 / 09:47 AM IST
ట్రంప్ పై ఏమంటారని అడిగితే….మూగబోయిన కెనడా ప్రధాని

మిన్నియాపోలీస్ సిటీ పోలీసుల పోలీసు చేతిలో ప్రాణాలు కోల్పోయిన నల్ల జాతీయుడు “జార్జ్‌ ఫ్లాయిడ్‌”కి మద్దతుగా అగ్రరాజ్యంలో ఆఫ్రో-అమెరికన్లు చేస్తున్న ఆందోళనలతో అమెరికా అట్టుకుతున్న విషయం తెలిసిందే. పలుచోట్ల ఆందోళనకారులు వాహనాలను,షాపులను తగులబెట్టడం చేస్తున్నారు. కొందరు ఆందోళనకారుల ముసుగులో షాపుల లూటింగ్ కు కూడా పాల్పడుతున్నారు.  కొనసాగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ సమయంలో  పొరుగు దేశ‌మైన కెన‌డాకు కూడా ఆ సెగ అంటుకుంది.

మంగళవారం(జూన్-2,2020) కెన‌డా ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో మీడియా స‌మావేశం నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో ఓ జ‌ర్న‌లిస్టు ఆయ‌న్ను ఇరుకున పెట్టే ప్ర‌శ్న వేశారు. అమెరికా అధ్య‌క్షుడు  చేప‌డుతున్న చ‌ర్య‌ల ప‌ట్ల మీరు నిర్లిప్తంగా ఉన్నార‌ని ట్రూడోను జ‌ర్న‌లిస్టు అడిగారు. నిర‌స‌న‌కారుల‌పై మిలటరీని దింపుతున్న‌ట్లు ట్రంప్ హెచ్చ‌రించారు. దీనిపై మీ ఏమి కామెంట్ చేస్తార‌ని కెన‌డా ప్ర‌ధానిని ఓ రిపోర్ట‌ర్ ప్ర‌శ్నించారు.  ఒక‌వేళ కామెంట్ ఇవ్వ‌లేక‌పోయినా.. ఎటువంటి మేసేజ్ లేదా సందేశం ఇస్తార‌ని ప్ర‌శ్నించారు. 

అయితే రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు…ఏం కామెంట్ చేయాలో తెలియని ట్రూడో కొద్ది సేపు మౌనంగా ఉండిపోయారు. 20సెకన్లపాటు ఆయన నోరు విప్ప‌లేక‌పోయారు. జ‌ర్న‌లిస్టు ప్ర‌శ్న‌కు బ‌దులు ఇచ్చేందుకు 20 సెక‌న్ల పాటు ఆలోచ‌న‌ల్లో ప‌డిపోయిన ట్రూడూ…చాలా దీర్ఘంగా ఆలోచించిన త‌ర్వాత త‌న అభిప్రాయాన్ని తెలిపారు.  అమెరికా నిర‌స‌న‌ల‌పై స‌మాధానం ఇచ్చేందుకు ట్రూడో ఎందుకు ఇంతలా ఆలోచించారో చెప్ప‌డం క‌ష్ట‌మే. కానీ ఆయ‌న చివ‌ర‌కు ఓ స్ప‌ష్ట‌మైన‌ విష‌యాన్ని వెల్ల‌డించారు. 

అమెరికాలో జ‌రుగుతున్న ప‌రిణామాలు తీవ్ర దిగ్భ్రాంతిని క‌లిగిస్తున్న‌ట్లు ట్రూడో తెలిపారు. ప్ర‌జ‌లంద‌ర్నీ స‌మీక‌రించాల్సిన క్ష‌ణం ఇదేన‌న్నారు. ఇది వినాల్సిన సమయం అని,నేర్చుకోవాల్సిన సమయం అని… ఏళ్లుగా, ద‌శాబ్ధాలుగా ప్ర‌గ‌తి సాధించినా…అన్యాయం మాత్రం జ‌రుగుతూనే ఉంద‌న్నారు. త‌మ‌కు కూడా ఇలాంటి స‌వాళ్లు ఉన్నాయ‌న్న విష‌యాన్ని కెన‌డా ప్ర‌జ‌లు గుర్తించాల‌న్నారు. న‌ల్ల‌జాతీయ కెన‌డీయులు, జాత్యాంహ‌కారానికి గురైన కెన‌డీయులు ప్ర‌తి రోజు ఏదోర‌కంగా వివ‌క్ష‌కు గుర‌వుతున్నార‌ని తెలిపారు. దేశంలో వ్య‌వ‌స్థీకృత వివ‌క్ష ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

కెన‌డాలోనూ వివ‌క్ష ఉన్న విష‌యం వాస్త‌వ‌మే అని ట్రూడో తెలిపారు. తాము దాన్ని గవర్నమెంట్ గా చూడకూడదని,కెనడియన్స్ గా చూడాలన్నారు. యాక్షన్ తీసుకోవాలన్నారు. కెనడాలో వివిక్షతపై పోరాటంలో అందరూ కలిసికట్టుగా ఉండాల్సిన అవసరముందని ట్రూడో తెలిపారు. తమ ప్రభుత్వం గడిచిన కొన్నేళ్లుగా అనేక చర్యలు తీసుకుందని,దాన్ని కొనసాగించనున్నట్లు ఆయన తెలిపారు. వివక్షతకు ముగింపు పలకాల్సిన అవసరముందన్నారు. కెనడా ప్రధానిగా కెనడియన్ల కోసం తాను నిలబటం తన బాధ్యత అని ఆయన తెలిపారు.

Read: ట్రంప్ అన్నంత పనిచేస్తారా? దేశాధ్యక్షుడికి మిలటరీని దింపే అధికారం ఉందా?