Kailasa: కైలాస దేశ ప్రతినిధుల కొత్త వాదన.. వాళ్లకు సరిహద్దులు లేవట ..

ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న విమర్శల నేపథ్యంలో కైలాస దేశ ప్రతినిధులు కొత్త వాదన ఎత్తుకున్నారు. కైలాస పేరుతో భౌగోళికంగా దేశం ఏదీ లేదని, తమది సరిహద్దులు లేని సేవా అధారిత దేశమని తెలిపారు.

Kailasa: కైలాస దేశ ప్రతినిధుల కొత్త వాదన.. వాళ్లకు సరిహద్దులు లేవట ..

Kailasa Country

Kailasa: భారతదేశంలో అత్యాచారం, అపహరణ వంటి అనేక కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ నాలుగేళ్ల క్రితం వివాదాస్పద గురువు నిత్యానంద దేశం విడిచివెళ్లిపోయిన విషయం విధితమే. ఆ తరువాత అతను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటన చేశారు. అంతేకాక ఆ దేశం నుంచి ప్రత్యేక ప్రతినిధులమంటూ కొందరు ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాల్గొన్నారు. భారతదేశంపై విమర్శలుసైతం చేశారు. అయితే, వీరిని మేం పరిగణలోకి తీసుకోమని, కైలాస దేశంగా మేము గుర్తించడం లేదని ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు స్పష్టం చేశారు. కైలాస పేరుతో దేశం ఏర్పాటు చేసినట్లు నిత్యానంద ప్రతినిధులు పేర్కొనడంతో పలు విమర్శలు వెల్లువెత్తాయి.

Nithyananda Kailasa: నిత్యానందకు షాకిచ్చిన యూఎన్.. వారి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోమని వెల్లడి

ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న విమర్శల నేపథ్యంలో కైలాస దేశ ప్రతినిధులు కొత్త వాదన ఎత్తుకున్నారు. కైలాస పేరుతో భౌగోళికంగా దేశం ఏదీ లేదని, తమది సరిహద్దులు లేని సేవా అధారిత దేశమని తెలిపారు. ప్రాచీన హిందూ నాగరికత పునరుద్ధరణకు కృషి చేస్తున్నామని, ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఐరాస గుర్తింపు పొందిన స్వచ్ఛంద సంస్థల ద్వారా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నామని కైలాస ప్రతినిధులు ట్విటర్ ద్వారా వెల్లడించారు. అంతేకాదు, సావరిన్ ఆర్డర్ ఆఫ్ మాల్టా (భౌగోళికంగా లేనప్పటికీ దేశంగా గుర్తింపు) దేశం స్ఫూర్తితో సరిహద్దులు లేని మా సేవా ఆధారిత దేశంలో కుల, మత, లింగ భేదం లేకుండా ప్రతీఒక్కరి ఆనందమే మా ధ్యేయం అని వారు పేర్కొన్నారు.

Nithyananda: అమెరికాకు తలనొప్పిగా మారిన నిత్యానంద.. 30 నగరాలతో ‘సిస్టర్ సిటీ’ ఒప్పందాలు

ఈక్వెడార్ ప్రాంతంలో సొంత ద్వీపముందని నిత్యానంద ఎప్పుడూ చెప్పలేదని, సావరిన్ ఆర్డర్ ఆఫ్ ముల్టా మాదిరిగానే కైలాస కూడా అన్ని స్వచ్ఛంద సంస్థలు, ఆలయాలతో పాటు వివిధ దేశాల్లో ఉన్న మఠాల ద్వారా వ్యవహారాలు కొనసాగిస్తుందని కైలాస ప్రతినిధులు వివరణ ఇచ్చారు.