ఎన్నికల ప్రచారంలో గొడుగు పట్టుకుని స్టెప్పులేసిన కమలా హరీస్

  • Published By: madhu ,Published On : October 23, 2020 / 01:38 PM IST
ఎన్నికల ప్రచారంలో గొడుగు పట్టుకుని స్టెప్పులేసిన కమలా హరీస్

kamala harris dances In The Rain : అమెరికా ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ నుంచి ఉపాధ్యక్ష అభ్యర్థిగా నామినెట్ అయిన..కమలా హారిస్ ఎన్నికల ప్రచారంలో కాసేపు స్టెప్పులు వేసి అదరగొట్టారు. వర్షం పడుతున్న వేళ..ఆమె గొడుగు పట్టుకుని ఓ సాంగ్ కు అనుగుణంగా డ్యాన్స్ చేశారు.



దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అక్టోబర్ 19వ తేదీ ఫ్లోరిడాలో జాక్వన్విల్లేలో ఓ బహిరంగ కార్యక్రమం జరిగింది. దీనికి కమలా హాజరయ్యారు. ఎన్నికల విషయానికి సంబంధించిన విషయాలను ఆమె వెల్లడించారు. ప్రసంగం పూర్తయిన తర్వాత..సాంగ్ కు డ్యాన్స్ చేసింది. అప్పటికే వర్షం పడుతుండడంతో ఆమె గొడుగు పట్టుకుని డ్యాన్స్ చేయడం అందర్నీ ఆకట్టుకుంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు స్పందిస్తున్నారు.
https://10tv.in/biden-vs-trump-us-presidential-election-2020/



కమలా..భారత సంతతికి చెందిన వారు. కాలిఫోర్నియా నుంచి డెమోక్రటిక్‌ సెనేటర్‌గా ఉన్న కమలా హారిస్‌ (55)ను ఆ పార్టీ అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలిచారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న జో బైడెన్‌.. ఉపాధ్యక్ష పదవికి కమల బరిలో నిలుస్తున్నట్లు వెల్లడించారు.



అమెరికా ఉపాధ్యక్ష పదవికి కమలా హారిస్‌ను ఎంపిక చేయడంతో తొలిసారి ఈ పదవికి ఓ నల్లజాతి మహిళ బరిలో నిలుస్తున్నట్లయింది. ఇక అధ్యక్ష పదవికి ట్రంప్, బైడెన్ (డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి) పోటీ పడుతున్నారు. ఇరువురి మధ్య మొదటి డిబెట్ పూర్తయింది. ఈ తరుణంలో ట్రంప్ కరోనా బారిన పడ్డారు. కొద్ది రోజుల తర్వాత..ఆయన కోలుకుని వైట్ హౌజ్ కు చేరుకున్నారు.



2020, అక్టోబర్ 23వ తేదీ శుక్రవారం రెండో చర్చ జరిగింది. కరోనా చట్టే ఇద్దరి మధ్య సంవాదం చోటు చేసుకుంది. రెండు వారాల కంటే..తక్కువ సమయం ఉన్న తరుణంలో ఈ చర్చ జరుగుతుండడంతో ట్రంప్, జో బైడెన్ పై అందరి దృష్టి సారించారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ట్రంప్ వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని, రాబోయే శీతాకాలంలో మరిన్ని చీకటి రోజులు ఎదుర్కొనబోతున్నామన్నారు జో బైడెన్.



తమ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే అంచనాల కంటే..తక్కువ మంది చనిపోయారని, తాను కరోనా నుంచి కోలుకున్నట్లుగానే…అందరూ బయటపడుతారని ట్రంప్ వ్యాఖ్యానించారు.