బ్రేక్ ఫాస్ట్‌లో ఇడ్లీ అంటే ఇష్టం.. అమెరికా ఎన్నికల ముందు కమల ఆసక్తికర వ్యాఖ్యలు

  • Published By: vamsi ,Published On : November 2, 2020 / 05:17 PM IST
బ్రేక్ ఫాస్ట్‌లో ఇడ్లీ అంటే ఇష్టం.. అమెరికా ఎన్నికల ముందు కమల ఆసక్తికర వ్యాఖ్యలు

Kamala Harris On Indian Dishes: ప్రపంచంలోనే పవర్‌ఫుల్‌గా భావించే అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3వ తేదీన జరగనున్నాయి. ఈ క్రమంలో డెమొక్రాటిక్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి కమలా హారీస్ ప్రచారంలో దూసుకుపోతూ.. భారతీయ ఓటర్లను ఆకర్షించేలా మాట్లాడారు. తనకు ఇష్టమైన భారతీయ వంటకాల గురించి చెబుతూ.. తనకు మంచి సాంబార్‌తో ఇడ్లీ, టిక్కా అంటే చాలా ఇష్టామని సౌత్, నార్త్ వంటకాల గురించి ప్రస్తావించారు.



కమలా హారీస్ తండ్రి జమైకన్ కాగా, తల్లి భారతీయురాలు. అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్న తొలి భారత సంతతి వ్యక్తి, నల్లజాతి మహిళ కమలా హారీస్ కాగా.. తనకు ఇడ్లీ సాంబార్ అంటే చాలా ఇష్టమని, ఇక నార్త్ ఇండియన్ వంటకం టిక్కా అంటే ఇష్టమని వెల్లడించారు. సోషల్ మీడియా యూజర్లతో ముచ్చటించిన కమల హారిస్.. తనకు వంట చేయడం అంటే చాలా ఇష్టమని, అప్పుడప్పుడు తన భర్త డగ్లస్‌కు వంట నేర్పిస్తుంటానని తెలిపారు.



తన గురించి మాట్లాడుతూ.. ఉదయాన్నే లేచిన తర్వాత వ్యాయామం తప్పకుండా చేస్తానని, ఆపై పిల్లలతో ఉల్లాసంగా గడుపుతానని స్పష్టం చేశారు. మహిళా సాధికారత గురించి కూడా మాట్లాడిన ఆమె.. మహిళలు జీవితంలో ముందుకెళ్లాలంటే అందుకు ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. జీవితంలో ఎన్నో తిరస్కారాలు చవిచూశానని, వాటన్నింటినీ పట్టించుకోకుండా ముందుకు సాగినట్లు చెప్పుకొచ్చారు.



ఇదే సమయంలో ఒక్క ఓటు ఫలితాలను మార్చగలదా? అనే ప్రశ్నకు.. ఒకటి రెండు ఓట్లు మొత్తం ఎన్నికల ఫలితాలనే మార్చేసిన ఘటనలు ఉన్నాయి. ఎన్నికల్లో ఓటర్లు తీసుకున నిర్ణయం మనస్ఫూర్తిగా ఉండాలి. అప్పుడే మంచి నిర్ణయాలు జీవితాలను ప్రభావితం చేస్తాయని అన్నారు. రాబోయే తరాలకు స్థిరమైన, పర్యావరణమైన భవిష్యత్తును ఎలా అందిస్తారని ప్రశ్నించగా.. దీని కోసం డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్, తాను చాలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కమలా హారీస్ తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పదవిలో ఉన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (74), ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌లపై జో బిడెన్, కమల హారిస్ పోటీ చేస్తున్నారు.