’మోడెర్నా’ టీకా మొదటి డోస్ వేయించుకున్న కమలా హారిస్

’మోడెర్నా’ టీకా మొదటి డోస్ వేయించుకున్న కమలా హారిస్

Kamala Harris First Dose of Moderna’s COVID-19 Vaccine : మొట్టమొదటి నల్లజాతి మహిళ, అమెరికా ఉపాధ్యక్షునిగా ఎన్నికైన కమలా హారిస్ మోడెర్నా కరోనా టీకా మొదటి డోస్ అందుకున్నారు. ప్రజల్లో టీకాపై విశ్వాసాన్ని పెంచాలనే ఉద్దేశంతో 56ఏళ్ల హారిస్ తొలి మోతాదు అందుకున్నారు. ఆమె భర్త Doug Emhoff కూడా మంగళవారం టీకా వేయించుకున్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ డిసెంబర్ 21న టెలివిజన్ లైవ్‌లో టీకాలు వేయించుకున్నారు. ఆయన భార్య జిల్ బైడెన్ కూడా టీకా మొదటి మోతాదును అందుకున్నారు. జనవరి 20న వ్యాక్సినేషన్ ముందు రెండవ టీకా మోతాదును అందుకోనున్నారు.

ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్‌ కూడా ఈ నెలలో వ్యాక్సిన్ అందుకున్న అధికారుల జాబితాలో చేరారు. ఇందులో హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి సెనేట్ మెజారిటీ లీడర్ మిచ్ మక్కన్నేల్ కూడా ఉన్నారు. ఉపాధ్యక్షుడు Mike Pence ఆయన భార్య Karen Pence డిసెంబర్ 18న మొదటిసారి ఈ టీకాను అందుకున్నారు. అక్టోబర్ నెలలో COVID-19తో ఆస్పత్రిలో చేరిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇంకా టీకాలు అందలేదు. ప్రయోగాత్మక యాంటీబాడీ కాక్టెయిల్‌తో చికిత్స పొందారు. ‘నేను ఇప్పుడే టీకాను వేయించుకున్నాను. టీకా పనితీరు ఇంకా తెలియదు.. రెండవ మోతాదు టీకా కోసం ఎదురుచూస్తున్నాను’ అని మోడెర్నా షాట్ అందుకున్న అనంతరం హారీస్ చెప్పారు.

ఈ టీకా ఎంతో సురక్షితమని నేను విశ్వసిస్తున్నానని హారీస్ చెప్పారు. వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన సైంటిస్టులు సైతం ఈ టీకా ఎంతో సురక్షితమని విశ్వసిస్తున్నారని ఆమె తెలిపారు. అందుకే ప్రతిఒక్కరూ మీ వంతు వచ్చినప్పుడు తప్పకుండా టీకా వేయించుకోవాలని కోరుతున్నానని హారీస్ తెలిపారు. ఈ టీకా మీ ప్రాణాన్ని, మీ కుటుంబ సభ్యుల జీవితాన్ని కాపాడుతుంది. వ్యాక్సిన్ వేయించుకోకపోతే వైరస్ బారినపడి చనిపోయే ప్రమాదం ఉందని అన్నారు. సమాజంలో టీకాపై నెలకొన్న అనుమానాలు, భయాలను తొలగించేందుకు తాను ముందుగా మొదటి టీకా మోతాదును వేయించుకున్నానని హారిస్ పేర్కొన్నారు.