కమలా హారిస్ పలికిన చిత్తి అంటే ఏమిటీ ?..ట్రెండింగ్ లో తమిళ పదం

  • Published By: madhu ,Published On : August 21, 2020 / 08:10 AM IST
కమలా హారిస్ పలికిన చిత్తి అంటే ఏమిటీ ?..ట్రెండింగ్ లో తమిళ పదం

డెమోక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్…ప్రసంగంలో ఉపయోగించిన ‘చిత్తి’ అనే పదం బడే పాపులర్ అవుతోంది. అసలు చిత్తి అంటే ఏమిటంటూ..అమెరికన్లు గూగుల్ లో తెగ వెతికేశారంట.



2020, ఆగస్టు 19వ తేదీ బుధవారం అమెరికాలో పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆమె కుటుంబసభ్యులు కూడా హాజరయ్యారు. కుటుంబ సంబంధాలపై ఆమె మాట్లాడుతూ…‘చిత్తి’ అనే పదం ఉపయోగించారు. అసలు చిత్తి అంటే ఏమిటంటూ అందరూ ఆలోచనలో పడ్డారు.

ఇది తమిళ పదం. తమిళంలో చిత్తి అంటే..చిన్నమ్మ అనే అర్థం వస్తుంది. ఈ విషయం తెలుసుకున్న భారతదేశంలోని తమిళులు సంతోషం వ్యక్తం చేశారు. కమలా హారిస్ తల్లి శ్యామలా గోపాలన్ ది తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై. అయితే..ఈమె అమెరికాకు వెళ్లి…జమైకా దేశస్తుడిని వివాహామాడారు. శ్యామలా గోపాలన్ సోదరి ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలోనే ఉంటున్నట్లు సమాచారం.



డెమోక్రటిక్ సమావేశం అనంతరం తన తల్లితో దిగిన ఫొటోలను కమలా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఇంటిని, కుటుంబంతో పాటు ప్రపంచాన్ని స‌మ‌దృష్టితో చూడాలన్నారు. ఈ విషయంతో పాటు ఎన్నో విషయాలు తన తల్లి తనకు నేర్పినట్లు తెలిపారు.


మనందరినీ ఏకతాటిపైకి తెచ్చే అధ్యక్షుడిగా జో బిడెన్‌కు ఓటు వేసి గెలిపించాలని అమెరికన్లను కోరారు. తన తల్లి నేర్పిన విలువలకు, బిడెన్ విజన్ కు కట్టుబడి ఉంటానంటూ ట్వీట్ చేశారు.

ప్రధాన పార్టీ డెమొక్రటిక్ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీకి దిగిన మొదటి నల్లజాతి మహిళగా హారిస్ రికార్డులకెక్కారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్ సమక్షంలో నవంబరులో జరగనున్న ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థిగా ఆమె నామినేట్ అయ్యారు.