ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళ కావొచ్చు, కానీ చివరి మహిళను కాదు – కమలా హారిస్

  • Published By: madhu ,Published On : November 8, 2020 / 08:25 AM IST
ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళ కావొచ్చు, కానీ చివరి మహిళను కాదు – కమలా హారిస్

అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళ కావొచ్చు..కానీ చివరి మహిళను కాదన్నారు కమలా హారిస్. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఆమె విజయం సాదించారు. ఎన్నికల్లో తన గెలుపు మహిళా లోకం సాధించిన విజయంగా అభివర్ణించారామె. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో బైడెన్, కమలా హారిస్ ప్రసంగించారు.



అధ్యక్ష పదవికి ఎన్నికైన బైడెన్ నిరంతరం అమెరికన్ల క్షేమం కోసమే ఆలోచిస్తారని, మెరుగైన భవిష్యత్ ను నిర్మించే శక్తి ప్రజల్లో ఉంటుందని వెల్లడించారు. అమెరికా దేశంలో పాతుకపోయిన జాతి వివక్షను నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు. మన ముందు ఉన్న లక్ష్యాలు అంత సులువైనవి కావని కానీ, కఠినమైన లక్ష్యాల కోసం నిరంతరం పోరాడుదామన్నారు.



అమెరికన్లు ప్రజాస్వామ్యాన్ని కాపాడారని, చరిత్రలో ఇది ఒక నూతన అధ్యాయమన్నారు. కొత్త అధ్యయనానికి నాంది పలుకుతామని, అమెరికా దేశానికి సరికొత్త రోజుగా అభివర్ణించారు. విజయానికి కృషి చేసిన ప్రతొక్కరికి ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు కమలా వెల్లడించారు.