పిల్లినైనా కాకపోతిని : ఫ్యాషన్ ఐకాన్ మృతి…పిల్లికి 14వేల కోట్ల ఆస్తి

  • Published By: venkaiahnaidu ,Published On : February 21, 2019 / 10:53 AM IST
పిల్లినైనా కాకపోతిని : ఫ్యాషన్ ఐకాన్ మృతి…పిల్లికి 14వేల కోట్ల ఆస్తి

ఫ్యాషన్ ప్రపంచానికి ఐకాన్ గా గుర్తింపు పొందిన ప్రముఖ డిజైనర్ కార్ల్ లాగర్ ఫెల్డ్(85) అనారోగ్య కారణాలతో మంగళవారం(ఫిబ్రవరి-19,2019) మరణించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన మరణం ఓ పిల్లికి వరంగా మారింది. ఆయన మరణం పిల్లికి వరంగా మారడమేమిటబ్బా అని అనుకుంటున్నారా? ప్రపంచంలో అత్యంత ధనికురాలిగా మారిన ఆ పిల్లి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జర్మనీకి చెందిన ఐకానిక్ ష్యాషన్ డిజైనర్ కార్ల్ లాగర్ ఫెల్డ్(85)  బర్మన్ జాతికి చెందిన ఓ పిల్లిని ఇష్టంగా పెంచుకున్నాడు. దానికి చౌపెట్టీ అని పేరు పెట్టాడు. 2001లో ఫ్రెంచ్ మోడల్ బాప్ టిస్టి గియాబికొని  దగ్గరి నుంచి ఈ పిల్లిని ఇష్టపడి  తెచ్చుకొని దానికి బాడీగార్డు,పనివాళ్లను నియమించి రాజభోగాలను అందించాడు. కార్లకు సంబంధిన ప్రకటనలు, పలు కాస్మోటిక్ బ్రాండ్స్ ప్రకటనల్లో కూడా ఈ పిల్లి కనిపించింది.మోడళ్లు ఫొటోలకు ఫోజులిచ్చేందుకు కూడా చౌపెట్టీని వాడేవారు. చౌపెట్టీకి ఇన్ స్టాగ్రామ్ లో 1లక్ష20వేల మందికి పైగా ఫాలోవర్స్ కూడా ఉన్నారు. చౌపెట్టీకి సంబంధించిన విషయాలను కార్ల్ తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. దీంతో సోషల్ మీడియాలో చౌపెట్టీకి తెగ క్రేజ్ వచ్చేసింది.

చౌపెట్టీపై ప్రేమతో చౌపెట్టీ..ది ప్రైవేట్ లైఫ్ ఆఫ్ ఎ హై ఫ్లైయింగ్ ఫ్యాషన్ క్యాట్ అనే పుస్తకాన్ని కూడా కార్ల్ రాశాడంటే దానిపై ఆయనకు ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు. చౌపెట్టీ ధనవంతురాలంటూ కార్ల్ తరచూ చెప్తుండేవాడు. తాను చనిపోయిన తర్వాత తాను ఎంతో ముద్దుగా పెంచుకొన్న చౌపెట్టీ ఏకాకి కాకూడని దాని బాగోగుల కోసం తన మొత్తం ఆస్తి 28వేల  కోట్లలో సగభాగం చౌపెట్టీకి అందిస్తానని గతంలోనే కార్ల్ ప్రకటించారు. దీంతో ఇప్పుడు కార్ల్ సంపాదించిన ఆస్తిలో 14వేల కోట్లు చౌపెట్టీకి దక్కనున్నాయి.దీంతో ప్రపంచంలోనే అత్యంత ధనికురాలైన పిల్లిగా చౌపెట్టీ నిలవనుంది.ఈ పిల్లి వయస్సు ఇప్పుడు ఏడు సంవత్సరాలు.ఈ ధనవంతురాలైన పిల్లి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. పిల్లినైనా కాకపోతిని అంటూ కొందరూ సరదాగా సెటైర్లు వేస్తున్నారు.

ఫ్యాషన్ ప్రపంచానికి విశేషమైన సేవలందించిన కార్ల్ లాగర్ ఫెల్డ్ అనారోగ్య కారణాలతో పారిస్ లో మంగళవారం రాత్రి మరణించిన  విషయం తెలిసిందే. ఎప్పుడూ నల్లరంగుదుస్తుల్లో,నల్ల కళ్లద్దాలు పెట్టుకొని, పోనీటెయిల్ తో కన్పించే కార్ల్ 1980లో పూర్తి ట్రెంట్ సెట్టర్ గా నిలిచాడు.కార్ల్ మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు,సెలబ్రిటీలు,డిజైనర్లు విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం ఫ్యాషన్ ప్రపంచానికి తీరని లోటు అని ప్రియాంక చోప్రాతో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు తెలిపారు.

Read Also:విన్నర్ ఎవరంటే: కొండచిలువ, మొసలి బిగ్ ఫైట్ చూశారా?
Read Also:దేశం అంటే ఇదే : రూ.6 లక్షల బిక్షాటన డబ్బు.. అమర జవాన్లకు
Read Also:ప్రియాపై ఫైర్ అవుతున్న లవర్స్ డే హీరోయిన్