Indian : కెనడాలో భారతీయుడికి కీలక పదవి

Indian : కెనడాలో భారతీయుడికి కీలక పదవి

Indian

Indian : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు ఆయా దేశాల్లో మంచి పదవులు లభిస్తున్నాయి. తాజాగా ఎన్నికైన బైడెన్ క్యాబినెట్ లో భారత సంతతి వ్యక్తులు చాలామందే ఉన్నారు. బైడెన్ ముఖ్య సలహాదారుల్లో కూడా భారతీయ మూలాలున్న వ్యక్తులు ఉండటం విశేషం.

ఇక తాజాగా కెనడా కూడా భారతీయ మూలాలున్న వ్యక్తులను తమ ప్రభుత్వంలో మంచి పదవుల్లో నియమిస్తుంది. ఈ నేపథ్యంలోనే పంజాబ్‌లోని లుథియానా ప్రాంతానికి చెందిన అంగద్ సింగ్ ధిల్లాన్ అనే వ్యక్తిని కెనడాలోని ఫెడరల్ గవర్నమెంట్ కు సంబంధించిన రవాణా మంత్రిత్వ శాఖలో డైరెక్టర్ గా నియమితులయ్యారు.

కాగా అంగద్ సింగ్ ధిల్లాన్ న్యూ బ్రున్స్విక్‌లోని మౌంట్ అల్లిసన్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం 2015లో లిబరల్ పార్టీలో చేరారు.