Khalistan: ఖలిస్థాన్ వేర్పాటువాదుల విధ్వంసంపై అమెరికా స్పందన

ఇటువంటి చర్యలు సరికాదని, వీటిని ఖండిస్తున్నామని అమెరికా పేర్కొంది. రాయబార కార్యాలయాల్లో రక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పింది. ప్రపంచంలోని మరికొన్ని దేశాల్లో ఖలిస్థాన్ మద్దతుదారులు రెచ్చిపోయారు.

Khalistan supporters: భారత్ లోని పంజాబ్ లో ఖలిస్థాన్ (Khalistan)వేర్పాటువాదుల వల్ల చోటుచేసుకుంటున్న పరిణామాలతో అమెరికా, యూకే సహా ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఖలిస్థాన్ మద్దతుదారులు విధ్వంసానికి పాల్పడిన విషయం తెలిసిందే. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కొలో భారత రాయబార కార్యాలయం(Indian Consulate)పై దాడి చేశారు. అలాగే, లండన్ లోని భారత రాయబార కార్యాలయం వద్ద త్రివర్ణ పతాకాన్ని దించేశారు.

శాన్ ఫ్రాన్సిస్కొలో భారత రాయబార కార్యాలయం వద్ద జరిగిన విధ్వంసంపై శ్వేత సౌధ ( White House) జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బే స్పందించారు. ఇటువంటి చర్యలు పూర్తిగా ఆమోదయోగ్యం కాదని, దీన్ని అమెరికా ఖండిస్తోందని చెప్పారు. దీనిపై విచారణ తమ దౌత్య భద్రతా శాఖ విచారణ జరుపుతోందని అన్నారు. జరిగిన నష్టంపై కూడా దృష్టిపెట్టామని తెలిపారు.

రాయబార కార్యాలయాల వల్ల భద్రతకు పటిష్ఠ చర్యలు తీసుకుంటామని చెప్పారు. అమెరికా, యూకే రాయబార కార్యాలయం వద్ద జరిగిన విధ్వంసాల వెనుక పాకిస్థాన్ ఐఎస్ఐ హస్తం కూడా ఉందని తాము భావిస్తున్నట్లు ఇండియన్ డిస్పొరా స్టడీస్ (FIIDS) తెలిపింది. యూకే, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు కూడా ఖలిస్థాన్ మద్దతుదారుల చర్యలపై స్పందించాయి.

ఇటువంటి తీరును ఉపేక్షించబోమని చెప్పాయి. కాగా, భారత్ లోని పంజాబ్ లో ఖలిస్థాన్ వేర్పాటువాద నాయకుడు, వారిస్ పంజాబ్ దె చీఫ్‌ అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేశారన్న ప్రచారం జరుగుతున్న వేళ భారత్ లోనూ పలు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. రెచ్చగొట్టే ప్రసంగాలతో అమాయక పంజాబ్ ప్రజలను ఖలిస్థాన్ ఉద్యమం వైపునకు అతడు నడిపిస్తున్నాడు.

Amritpal Singh: అమృత్ పాల్ సింగ్ కోసం కొనసాగుతున్న వేట.. తీవ్రవాద కోణం ఉందా అని పోలీసుల అనుమానం?

ట్రెండింగ్ వార్తలు