Head Stuck : వామ్మో… ఈ అమ్మాయేంటి.. ఇలా వేలాడుతోంది..!?

ప్రమాదవశాత్తు 8 అంగుళాల రంద్రంలో తల దూర్చింది ఓ బాలిక.. రంద్రంలో తల చిక్కుకోవడంతో బయటకు రాలేకపోయింది. ఫైర్ సిబ్బంది శ్రమించి బాలికను బయటకు తీశారు.

Head Stuck : వామ్మో… ఈ అమ్మాయేంటి.. ఇలా వేలాడుతోంది..!?

Head Stuck

Head Stuck : చిన్న పిల్లలు తెలిసి తెలియక చేసే పనులు వారిని ప్రమాదాల బారిన పడేస్తాయి. కొన్ని సార్లు ప్రాణాలమీదకు కూడా తెస్తాయి. తాజాగా చైనాలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ బాలిక ఎక్స్‌ట్రాక్షన్ ఫ్యాన్‌ బిగించడం కోసం చేసిన 8 అంగుళాల రంద్రంలో తల పెట్టింది. ఇంట్లోని మొదటి అంతస్తు ఎక్కిన బాలిక ప్రమాదవశాత్తు ఎక్స్‌ట్రాక్షన్ ఫ్యాన్‌ రంద్రంలో తలపెట్టింది. రంద్రం చిన్నదిగా ఉండటంతో తల అందులో ఇరుక్కుపోయింది. నోరు తెరిచేందుకు వీలు కాకపోవడంతో ఎవరిని పిలువలేకపోయింది.

కింద ఫ్లోర్ లో ఉన్న తల్లిదండ్రులు ఆమెను గమనించినప్పటికీ తమ కూతురని గుర్తించలేకపోయారు. ఎదో బంతి అని పొరపాటు పడ్డారు. తీరా పైకి వెళ్లి చూస్తే.. కాళ్ళు పైకి లేపి తల ఇరుక్కుపోయిన స్థితిలో కనిపించింది ఆ బాలిక. బయటకు తీసేందుకు ప్రయత్నించారు.. తమ వల్ల కాకపోవడంతో వెంటనే అగ్నిమాక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి 40 నిమిషాలు శ్రమించి బాలికను సురక్షితంగా బయటకు తీశారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.

కాగా ఆ బాలిక సుమారు మూడు గంటల పాటు ఆ 8 అంగుళాల రంద్రంలో అలాగే ఉండిపోయింది. తమ కూతురి తల రంద్రంలో ఇరుక్కుందని గ్రహించడానికి ఆ తల్లిదండ్రులకు 40 నిమిషాలు పట్టింది. ఆ తర్వాత ఫైర్ సిబ్బంది రావడానికి గంట పట్టండి. ఫైర్ సిబ్బంది వంట నూనె ఉపయోగించి 40 నిమిషాలు శ్రమించి బాలికకు ఎటువంటి గాయం కాకుండా బయటకు తీశారు. ఇక ఈ రెస్క్యూ ఆపరేషన్ ను వీడియో తీసిన ఫైర్ సిబ్బంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.