North Korea : అక్కడ వేల కిలోమీటర్ల మేర ‘కరోనా గోడ’ కడుతూనే ఉన్నారు

కరోనా భయం ఇంకా ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. కరోనా వైరస్ తమ దేశంలో రాకుండా ఉత్తరకొరియాలో కిమ్ ప్రభుత్వం వేల కిలోమీటర్ల మేర గోడ కడుతోంది. 2020 నుంచి కడుతున్న ఈ గోడకు సంబంధించిన ఉపగ్రహ ఛాయా చిత్రాలు బయటకు వచ్చాయి.

North Korea : అక్కడ వేల కిలోమీటర్ల మేర ‘కరోనా గోడ’ కడుతూనే ఉన్నారు

North Korea

North Korea : ఇప్పటికీ ప్రపంచ దేశాలకు కరోనా భయం పోలేదు. కరోనా వినాశనం నుంచి ఇంకా కొన్ని దేశాలు తేరుకోలేదు. ఉత్తర కొరియాలో వైరస్ చొరబడకుండా కిమ్ ప్రభుత్వం పగడ్బందీ చర్యలు చేపట్టింది. 2020 నుంచి చైనా, రష్యా సరిహద్దుల్లో వేల కిలోమీట్ల మేర కంచెలు, గోడలు కట్టుకుంటూ వెళ్తోంది.

Kim Jong Un : నార్త్ కొరియా నియంత కిమ్ గురించి గూగుల్లో చదివిన గూఢాచారికి మరణశిక్ష

కరోనా బలహీనపడినప్పటికీ ఇంకా ప్రపంచ దేశాల్లో దాని తాలూకు భయం వీడలేదు. ఉత్తర కొరియా ప్రభుత్వం కరోనా వైరస్ అడ్డుకోవడానికి గట్టి చర్యలు తీసుకుంటూనే ఉంది. అందులో భాగంగానే తమ దేశంలోకి వైరస్ రాకుండా 2020 నుంచి రష్యా, చైనా సరిహద్దుల్లో కొన్ని వేల కిలోమీట్ల మేర గోడ కట్టుకుంటూ వెళ్తోంది. శాటిలైట్ తీసిన ఫోటోల ద్వారా ఈ విషయం తెలుస్తోంది.

Kim ‘Real-War’ Orders : ‘నిజమైన యుద్ధానికి’ సిద్దం కావాలని కిమ్ ఆదేశం .. కూతురితో సైనిక విన్యాసాలను వీక్షించిన ఉత్తరకొరియా అధ్యక్షుడు

గతంలో కిమ్ అరాచకాలు భరించలేక చాలామంది జనం దక్షిణ కొరియాకు పారిపోతూ ఉండేవారు. ఇప్పుడు ఈ గోడ నిర్మాణాలతో సరిహద్దు మూత పడటంతో పారిపోయే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. 2019 లో దక్షిణ కొరియాకు పారిపోయిన వారి సంఖ్య 1,047 కాగా అది ఇప్పుడు 67 కి తగ్గిపోయింది. అంటే ఎంతమంది పారిపోయారో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ గోడల నిర్మాణం చైనా వ్యాపార, వాణిజ్యాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని చెప్పాలి.