మొన్న కనిపించింది ఒరిజినల్ కిమ్ కాదంట!

  • Published By: venkaiahnaidu ,Published On : May 6, 2020 / 03:51 PM IST
మొన్న కనిపించింది ఒరిజినల్ కిమ్ కాదంట!

త్తరకొరియా నియంత కిమ్ జోన్ ఉన్ ఆరోగ్యం గురించి అంతర్జాతీయంగా మీడియాలో రెండు వారాలుగా చాలా కథనాలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం కిమ్ ఒక్కసారిగా కన్పించకుండా పోయేసరికి ఆయనకు హార్ట్ సర్జరీ జరిగిందని,ఆయన కోలుకుంటున్నారని,చనిపోయారని అంతర్జాతీయ వార్తాసంస్థలు కథనాలు ప్రసారం చేశాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు చెక్ పెడుతూ మే-1,2020న కిమ్ జోంగ్ ఉన్ ప్రజల మధ్యకు వచ్చాడు.

రాజధాని ప్యాంగ్యాంగ్ కు సమీపంలో ఓ ఎరువుల ఫ్యాక్టరీని రిబ్బన్ కట్ చేసి కిమ్ ప్రారంభిన ఫొటోలు,వీడియోను ఆ దేశ మీడియా మే-2న విడుదల చేసిన విషయం తెలిసిందే .దీంతో 20 రోజులుగా కనిపించకుండా పోయిన కిమ్‌… పబ్లిక్‌లో ఒక్కసారిగా కనిపించి అందరి నోటికి తాళాలు వేశారు. అయితే ఇప్పుడు ఈ విషయం కూడా దుమారంగా మారింది. మే 2న కనిపించింది కిమ్‌ కాదని, నకిలి కిమ్‌ అని కొందరు సోషల్‌ మీడియా యూజర్లు ఆయన పాత ఫోటోలని కొత్త ఫోటోలతో పోలుస్తూ నిజాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

అంతకు ముందు ప్రపంచాన్ని గడగడలాడించిన నియంతలు  హిట్లర్‌, సద్దామ్‌ హుస్సేన్‌ లాంటి వాళ్లు కూడా బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేటప్పుడు తమ బదులు నకిలిని పంపించేవారు. ఇప్పుడు కిమ్‌ కూడా తన ఆరోగ్యం బాగుపడే వరకు ఇదే చెయ్యాలనుకుంటున్నారని కొందరు భావిస్తున్నారు. బ్రిటన్ మాజీ ఎంపీ లూయిస్‌ మెన్ఛ్‌ అది వరకు తీసుకున్న ఫోటోలతో పోలీస్తే కిమ్‌ పళ్ల వరుస తేడాగా ఉందని తన ట్వీటర్‌లో మే-2 న రెండు ఫోటోలు కలిపి ట్వీట్‌ చేశారు. ఇప్పుడు చాలా మంది ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. కిమ్‌ కనబడగానే వదంతులన్ని ముగిసిపోతాయి అనుకుంటే కొత్తగా మరికొన్ని రూమర్స్‌   చక్కర్లు కొడుతున్నాయి.

మరోవైపు, ఏప్రిల్ 11 వ తేదీ నుంచి మే 1 వ తేదీవరకు కిమ్ ఎవరి కనిపించకపోవడానికి పెద్ద కారణాలే ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా కిమ్ చనిపోయినట్టుగా నటించడానికి, ఆ విధంగా వార్తలు సృష్టించడానికి ఓ బలమైన కారణం ఉందని అంటున్నారు.  ఒకవేళ కిమ్ మరణిస్తే, దేశంలో ఎలాంటి కుట్రలు జరుగుతాయి, దేశాన్ని ఎలా ఆక్రమించుకోవాలని చూస్తారు, దానికి సంబంధించిన అంశాలు ఎలా ఉంటాయి, ఎవరు కుట్రలు చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవడానికి ఈ విధంగా నాటకం ఆడారట కిమ్. 20 రోజుల్లో ఎవరెవరు ఎలాంటి కుట్రలు చేశారు అనే విషయాలను కిమ్ తెలుసుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. 

కాగా,కిమ్ కు హార్ట్ సర్జరీ జరిగినట్లుగా భావించి..ఆయన తర్వగా కోలుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే…అసలు కిమ్ కు ఎలాంటి సర్జరీ జరుగలేదని ఇటీవల సౌత్ కొరియా సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే.