కరోనా దేశంలోకి వస్తే..అధికారుల్ని చంపేస్తానంటూ వార్నింగ్!: దటీజ్ కిమ్ జాంగ్..!!

  • Published By: veegamteam ,Published On : February 29, 2020 / 10:17 AM IST
కరోనా దేశంలోకి వస్తే..అధికారుల్ని చంపేస్తానంటూ వార్నింగ్!: దటీజ్ కిమ్ జాంగ్..!!

కరోనా వైరస్ దేశంలోని వస్తే..తీవ్ర పరిణామాలు ఉంటాయని..అటువంటి పరిస్థితి రాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. కరోనా దేశంలోని ఎంట్రీ ఇచ్చిదంటే అధికారుల్ని చంపేస్తానన్నట్లుగా ఉత్తర కొరియా అధ్యక్షుడు..సుప్రీం లీడర్..కిరాతకానికి పరాకాష్ట అయిన కిమ్ జాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయాన్ని పొలిట్‌బ్యూరో సమావేశంలో కిమ్  అన్నారనీ ఉత్తరకొరియా అధికారిక సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ శనివారం (ఫిబ్రవరి 29,2020)న తెలిపింది.

కరోరా వైరస్ రాకుండా బేషరతుగా చర్యలు తీసుకోవాలని గట్టి వార్నింగ్ ఇచ్చారు కిమ్. కిమ్ ఎంతటి క్రూరుడో చెప్పటానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. కిమ్ జాంగ్ క్రూరత్వం ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలుసు. నియంత అనే పదం చాలా చాలా తక్కువ. అసలు మనుషులను మనుషులుగా చూడని ఈయన ఎవరిని అయినా చంపడానికి వెనకాడని మనస్తత్వం ఈయనది. ఆయన మాట వినకపోతే సొంత మనుష్యుల్ని కూడా మట్టుపెట్టటానికి వెనుకాడనే అంటుంటారు. 

అధ్యక్షుడి వార్నింగ్ తో అక్కడి అధికారులు హడలిపోతున్నారు. వణికిపోతున్నారు. దీంతో చాలా చాలా పకడ్భంధీగా జాగ్రత్తగా తీసుకుంటున్నారు. సార్.. మాటంటే మాటే..జరగరానిది ఏదన్నా జరిగితే తలకాయలు లేచిపోవటం ఖాయం అని అధికారులకు తెలియనిది కాదు. 

నరకం అంటే ఏంటో బ్రతికి ఉండగానే కనపడుతుందనే విషయం తెలిసిందే. చావు ఏ రూపంలో వస్తుందో అర్ధం కాని పరిస్థితి. ఇప్పుడు ఆయన తీసుకున్న ఒక నిర్ణయం అక్కడి అధికారులు చుక్కలు చూపిస్తోంది. కరోనా గనుక దేశంలోకి అడుగు పెడితే చంపేస్తానన్నట్లుగా వార్నింగ్ ఇచ్చారు.

కొవిడ్‌ వైరస్‌ దేశంలోకి రాకుండా కట్టడి చేయాలని, విఫలమైతే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన అధికారులకు స్పష్టమైన హెచ్చరికలు చేసారు. వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో ఉదాసీనత కనబరిచినట్లు ఆరోపణలు రావడంతో అధికార వర్కర్స్‌ పార్టీ వైస్‌ ఛైర్మన్‌ రీ మాన్‌ గొన్‌, పాక్‌ తే డొక్‌ను పదవి నుంచి తప్పించారాయన. వైరస్‌ దేశంలోకి వచ్చే అవకాశం ఉన్న అన్ని మార్గాల్ని మూసివేయాలని ఆయన ఆదేశించారు. విదేశీయులను అన్ని తనిఖీలు చెయ్యాలని అధికారులకు ఆదేశించారు.

కాగా..చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ తీవ్రత ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. దక్షిణకొరియాలో ఈ వైరస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులున్నాయి. శుక్రవారం (ఫిబ్రవరి 28,2020) కొత్తగా మరో 594 మందికి దక్షిణ కోరియాలో ఈ వైరస్ సోకింది అని గుర్తించారు. అక్కడ బాధితుల సంఖ్య 2,931కి చేరింది. దేగు ప్రాంతంలో మరో ముగ్గురు మహిళలు మరణించడంతో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. ఈ  క్రమంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు ఇచ్చిన వార్నింగ్ తో అధికారులు కరోనా వైరస్ సోకినదానికంటే ఎక్కువగా భయంతో వణికిపోతున్నారు.