Kim’s Daughter: మరోసారి తన కూతురితో కలిసి సైనికుల వద్దకు కిమ్.. ఏం సందేశం ఇస్తున్నారు?

కిమ్ రెండోసారి తన కూతురు ‘జు ఏ’ తో కలిసి మరో కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో తన వారసురాలు, భవిష్యత్తులో ఉత్తర కొరియాకు కాబోయే అధ్యక్షురాలు ఆమేనని కిమ్ సూచనలు ఇస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కిమ్ తాజాగా తన కూతురితో కలిసి సైనికులు, శాస్త్రవేత్తల వద్దకు వెళ్లారు. వీరంతా ఉత్తర కొరియా ఇటీవల ప్రయోగించిన హ్వాసాంగ్-17 ఖండాంతర క్షిపణి అభివృద్ధిలో పాల్గొన్నవారు.

Kim’s Daughter: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన కూతురు ‘జు ఏ’ (10)ను మరోసారి ప్రపంచానికి చూపించారు. ఇటీవలే ఆయన ‘జు ఏ’ను ప్రపంచానికి పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఆమెతో కలిసి కిమ్ జోంగ్ ఉన్ ఇటీవలే ఖండాంతర క్షిపణి ప్రయోగాన్ని వీక్షించారు. కిమ్ కి ‘జు ఏ’ రెండో కూతురని దక్షిణ కొరియా జాతీయ నిఘా సంస్థ స్పష్టం చేసింది.

ఇప్పుడు ఆయన రెండోసారి జు ఏ తో కలిసి మరో కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో తన వారసురాలు, భవిష్యత్తులో ఉత్తర కొరియాకు కాబోయే అధ్యక్షురాలు ఆమేనని కిమ్ సూచనలు ఇస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కిమ్ తాజాగా తన కూతురితో కలిసి సైనికులు, శాస్త్రవేత్తల వద్దకు వెళ్లారు. వీరంతా ఉత్తర కొరియా ఇటీవల ప్రయోగించిన హ్వాసాంగ్-17 ఖండాంతర క్షిపణి అభివృద్ధిలో పాల్గొన్నవారు.

వారితో కిమ్, ఆయన కూతురు ఫొటోలు దిగారు. అలాగే, ఆయుధాలతోనూ కిమ్, జు ఏ ఫొటోలు దిగడం గమనార్హం. కొన్ని రోజుల క్రితం కిమ్ తో కలిసి జు ఏ కనపడిన సమయంలో ఆమె తెల్ల కోటు, ఎరుపురంగు షూ వేసుకుంది. ఆ సమయంలో కిమ్ తో పాటు ఆయన భార్య రి సోల్ యూ కూడా ఉన్నారు.

తాజాగా, కిమ్ కూతురు ఒక్కరే కనపడ్డారు. ఆమె ఈ సారి పూర్తి నలుపు రంగు దుస్తుల్లో కనపడింది. కిమ్ జోంగ్ ఉన్ కూడా నలుపు రంగు దుస్తుల్లో ఉన్నారు. కిమ్ కు ముగ్గురు కూతుళ్లని, వారిలో రెండో కూతురు జు ఏ అంటే ఆయనను చాలా ఇష్టమని ప్రచారం జరుగుతోంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

ట్రెండింగ్ వార్తలు