మూడో అంతస్తు నుంచి దూకిన చిన్నారి..బాల్ లా పట్టుకున్న సెక్యూర్టీ గార్డు

  • Published By: madhu ,Published On : November 4, 2020 / 01:56 PM IST
మూడో అంతస్తు నుంచి దూకిన చిన్నారి..బాల్ లా పట్టుకున్న సెక్యూర్టీ గార్డు

Kindergarten Student Jumps off School Building : తెలిసి చేశాడో లేక తెలీక చేశాడో తెలీదు కానీ.. చైనాలో ఓ చిన్నారి స్కూల్ బిల్డింగ్‌లో మూడో అంతస్తు నుంచి దూకేశాడు. అతని మరణం ఖాయమని దాదాపు అందరూ అనుకుంటుండగా.. అప్పుడు దేవుడిలా వచ్చాడు ఓ సెక్యూరిటీ గార్డ్. ఇక ఆ చిన్నారి నెలను ఢీకొడతాడు అనుకుంటుండగా.. బాల్‌ను క్యాచ్ చేసినట్టు.. ఆ చిన్నారిని పట్టుకున్నాడు. దీంతో స్వల్ప గాయాలతో ఆ చిన్నారి మృత్యువు నుంచి తప్పించుకున్నాడు.



స్కూల్ టాయిలెట్ లో డోర్ లాక్ కావడంతో ఆ చిన్నారి అక్కడే చిక్కుకుపోయాడు… బయటికి ఎలా వెళ్లాలో తెలియక కిటికి డోర్ తెరిచి బయటికి రావడానికి ప్రయత్నించాడు. అప్పటికే ఆ చిన్నారిని గమనించిన తోటి విద్యార్థులు, టీచర్లు ముందుకు రావద్దంటూ హెచ్చరించారు. కానీ ఆ చిన్నారి ముందుకు అడుగేశాడు. అంతే.. అంతెత్తు నుంచి పడిపోయాడు..



సెక్యూరిటీ గార్డ్‌ పుణ్యమా అని అతను ప్రాణాలతో బతికి బయటపడ్డాడు.. సెక్యూరిటి గార్డ్‌ స్పాట్‌ రియాక్షన్‌కు అందరూ అతడిని అభినందించారు. చైనా షాన్ డాంగ్ ప్రావిన్స్ లోని గ్జిన్హా గ్రామంలో ఈ ఘటన జరిగింది. వెంటనే ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించారు.