పతంగితో పాటు పైకి లేచిన చిన్నారి..గాల్లోనే.. వీడియో వైరల్

  • Published By: madhu ,Published On : August 31, 2020 / 08:54 AM IST
పతంగితో పాటు పైకి లేచిన చిన్నారి..గాల్లోనే.. వీడియో వైరల్

పతంగి ఫెస్టివల్ లో ఎవరూ ఊహించిన సీన్ కనిపించింది. పతంగితో పాటు..ఓ చిన్నారి అమాంతం గాల్లోకి ఎగిరింది. మూడేళ్ల చిన్నారి..పతంగితో పాటు…30 సెకన్ల పాటు గాల్లోనే ఉండిపోయింది. ఒక్కసారిగా అక్కడున్న వారందరూ ఆందోళన చెందారు. ఆ చిన్నారికి ఏమవుతుందోనన్న ఉత్కంఠ వారిలో నెలకొంది. ఈ ఘటన ఉత్తర తైవాన్ లో చోటు చేసుకుంది.



ఉత్తర తైవాన్ లో కైట్ ఫెస్టవల్ నిర్వహిస్తుంటారు. తైవాన్ రాజధానికి 80 కిలోమీటర్ల దూరంలో..హింజో ప్రాంతంలో నిర్వహస్తున్న పతంగి పండుగకు భారీగా ప్రజలు హాజరయ్యారు. పలు దేశాలకు చెందిన వారు వింత వింత ఆకారాలు, భారీ పతంగులను ఎగురేస్తున్నారు.


https://10tv.in/unlock-4-0-guidelines-hyderabad-metro-may-start/
ఎంతో ఉత్సాహంగా..సందడిగా సాగుతున్న క్రమంలో..ఒక్కసారిగా అలజడి చెలరేగింది. మూడేళ్ల చిన్నారిని..గాలిపటానికి చుట్టుకోవడం..అమాంతం గాల్లోకి ఎగిరిపోవడం జరిగిపోయింది. కైట్ తో పాటు చిన్నారి ఎగురుతుండడం అక్కడున్న వారు గమనించారు.



కొద్దిసేపటికి గాలి వీచడం తక్కువ కావడంతో..పతంగి కిందకు వచ్చింది. అమాంతం గాలి పటాన్ని పట్టుకుని..కిందకు దించారు. చిన్నారికి స్వల్ప గాయాలు మినహా పెద్ద ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.