కోస్తా రొయ్యలపై ‘కోవిడ్’ ఎఫెక్ట్… విదేశాలకు తగ్గిన ఎగుమతులు

కోవిడ్‌(కరోనా) వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాను బెంబేలెత్తిస్తున్న కోవిడ్‌ ప్రభావం ఇప్పుడు రొయ్యల ఎగుమతిపై కూడా పడింది.

  • Published By: veegamteam ,Published On : February 13, 2020 / 02:46 AM IST
కోస్తా రొయ్యలపై ‘కోవిడ్’ ఎఫెక్ట్… విదేశాలకు తగ్గిన ఎగుమతులు

కోవిడ్‌(కరోనా) వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాను బెంబేలెత్తిస్తున్న కోవిడ్‌ ప్రభావం ఇప్పుడు రొయ్యల ఎగుమతిపై కూడా పడింది.

కోవిడ్‌(కరోనా) వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఇపట్పివరకు 1000కి పైగా మృతి చెందారు. చైనాను బెంబేలెత్తిస్తున్న కోవిడ్‌ ప్రభావం ఇప్పుడు రొయ్యల ఎగుమతిపై కూడా పడింది. కోవిడ్‌ దెబ్బకు రొయ్యల సాగు రైతులు కుదేలవుతున్నారు. కోస్తా జిల్లాల్లో లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు అవుతోంది.

కృష్ణా జిల్లాలో 50 వేల ఎకరాల్లో వనామీ రొయ్యల సాగు
ఒక్క కృష్ణా జిల్లాలోనే 50 వేల ఎకరాల్లో వనామీ రొయ్యల సాగు చేస్తున్నారు. ఏటా 1.80 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి జరుగుంది. ఈ రొయ్యలను ఆక్వా రైతుల నుంచి వివిధ కంపెనీలు కొనుగోలు చేసి, ప్రాసెసింగ్‌ అనంతరం చైనా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు సహా యూరప్‌కు ఎగుమతి చేస్తుంటారు. జిల్లాలో ఉత్పత్తైన రొయ్యల్లో 90 శాతం విదేశాలకే ఎగుమతి అవుతాయి.

తగ్గిన రొయ్యల ధర  
ప్రస్తుతం కరోనా వైరస్‌ కల్లోలం సృష్టిస్తుండడంతో రొయ్యల ఎగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. అదే సమయంలో మనదేశం నుంచి విదేశాలు రొయ్యల దిగుమతికి ఆసక్తి చూపడం లేదు. దీంతో కొనుగోలు కంపెనీలు రొయ్యల ధర తగ్గించేస్తున్నాయి. ఇలా ఇప్పుడు రొయ్యల సైజు/కౌంట్‌ను బట్టి రూ. 30 నుంచి రూ. 50 వరకు తగ్గిపోయింది. చిన్న రైతుల వద్ద అయితే ప్రస్తుత ధరల కంటే కౌంట్‌కు మరో రూ. 20 తక్కువకే కొనుగోలు చేస్తున్నారు. ఇలా రొయ్యల రైతు నష్టాల పాలవుతున్నాడు. కొన్నాళ్లుగా వైరస్‌ సోకి రొయ్యల సాగు నష్టాలను తెచ్చిపెడుతోంది. ఈ ఏడాది వైరస్‌ బెడద లేకపోవడంతో ఆక్వా రైతు సంతోషపడుతున్న తరుణంలో కరోనా వైరస్‌ వారిని దెబ్బకొట్టింది.  

పెరిగిన రొయ్యల మేత ధరలు  
ఒకవైపు రొయ్యల ఎగుమతులు తగ్గి ధరలు క్షీణిస్తుండగా మరోవైపు రొయ్యల మేత ధరలు పెరిగిపోయాయి. కొంత కాలం క్రితం వరకు 25 కిలోల మేత (ఫీడ్‌) బస్తా రూ. 2,100 ఉండేది. ప్రస్తుతం అది రూ. 2,230కి పెరిగింది. వీటితో పాటు ఇతర కెమికల్స్, ప్రొబయోటిక్స్‌ వంటి వాటి ధరలు కూడా పెరిగాయి. విదేశాల నుంచి రొయ్యల మేత దిగుమతులు తగ్గడమే వీటి ధరల పెరుగుదలకు కారణంగా వ్యాపారులు చెబుతున్నారు.

రొయ్యలకు వైరస్‌ సోకడంతో నష్టాలు : ఆక్వా రైతు 
రొయ్యలకు వైరస్‌ సోకి నష్టాల పాలవుతున్నామని వేమవరప్పాడు ఆక్వా రైతు తలారి శ్రీహరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా కరోనా వైరస్‌ పేరిట రొయ్యల ధరలు తగ్గించి కొనుగోళ్లు చేస్తున్నారని తెలిపారు. ఈ పది రోజుల్లో కౌంట్‌కు రూ. 30 నుంచి రూ. 50 వరకు ధర తగ్గిపోయిందన్నారు. రొయ్యలను నిల్వ ఉంచుకునే పరిస్థితి లేదని చెప్పారు. విధిలేక అమ్ముకోవలసి వస్తోందని తెలిపారు. రొయ్యల ధరలు తగ్గడం, మేత ధరలు పెరగడం తమకు నష్టాలను తెచ్చిపెడుతున్నాయని వాపోయారు. 
corona effect