Kristina Lisina : పోర్ట్ నటి జీవితం విషాదాంతం.. చివరికి ఆత్మహత్య

Kristina Lisina : రష్యన్ అడల్ట్ స్టార్(పోర్న్ నటి) క్రిస్టినా లిసీనా(29) జీవితం విషాదాంతమైంది. బ్యాంకు ఉద్యోగం వదిలేసి ఊహించని రీతిలో పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది క్రిస్టినా.

Kristina Lisina : పోర్ట్ నటి జీవితం విషాదాంతం.. చివరికి ఆత్మహత్య

Kristina Lisina

Kristina Lisina : రష్యన్ అడల్ట్ స్టార్(పోర్న్ నటి) క్రిస్టినా లిసీనా(29) జీవితం విషాదాంతమైంది. అనాథలా మారి ఆత్మహత్య చేసుకుంది. ఒంటరితనం భరించలేక సూసైడ్ చేసుకుంది. మంచి బ్యాంకు ఉద్యోగం వదిలేసి ఊహించని రీతిలో పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది క్రిస్టినా. పోర్న్ హబ్, ఓన్లీ ఫ్యాన్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది. అయితే అడల్ట్ ఇండస్ట్రీలోకి వెళ్లడంతో అయినవాళ్లందరికీ దూరమైంది. కుటుంబసభ్యులు ఆమెను వెలేశారు. దీంతో అనాథలా మారింది. తిరిగి కుటుంబంతో కలిసే ప్రయత్నం చేసినప్పటికీ కుదరలేదు. ఒంటరితనం వేధించింది. ఆ బాధ తట్టుకోలేక తాను ఉంటున్న అపార్ట్ మెంట్ 22 వ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

క్రిస్టినా లిసీనా.. ప్రొఫెషనల్ గా క్రిస్ ద ఫాక్స్ గా గుర్తింపు పొందింది. నటి మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె మృతికి గల కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. సెయింట్ పీటర్స్ బర్గ్ లోని హై రైస్ బిల్డింగ్ లో ఆమె ఉంటోంది. చనిపోయిన సమయంలో ఆమె చేతిలో ఓ కాయిన్ ను పోలీసులు గుర్తించారు. యు ఆర్ ఆల్వేస్ ఇన్ మై హార్ట్ అని దానిపై రాసి ఉంది.

ఆమె మరణం గురించి ఆమె బాయ్ ఫ్రెండ్ తెలిపాడు. క్రిస్టినా అంత్యక్రియల కోసం డబ్బు సాయం చేయాలని కోరాడు. లిసీనా సైబీరియా నుంచి సెయింట్ పీటర్స్ బర్గ్ కు వెళ్లింది. తొలుత ఓ బ్యాంకులో పని చేసేది. వారానికి 5 రోజులు పని చేసేది. అయితే దాని మీద ఆమెకు అంత ఇంట్రస్ట్ ఉండేది కాదు. ఆ తర్వాత ఊహించని రీతిలో అడల్ట్ ఇండస్ట్రీలోకి వెళ్లింది. లిసీనా మృతి తర్వాత ఆమెకి చెందిన ఓన్లీ ఫ్యాన్స్ పేజీని డిసేబుల్ చేసేశారు.