ఇండో-చైనా సైనికుల ఘర్షణ తర్వాత అద్భుతంగా మాట్లాడారు, ప్రధాని మోడీపై చైనా మీడియా ప్రశంసల వర్షం

గల్వాన్ లో చైనా-ఇండియా సైనికుల ఘర్షణ గురించి ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై మన దేశంలోని విపక్షాలు

ఇండో-చైనా సైనికుల ఘర్షణ తర్వాత అద్భుతంగా మాట్లాడారు, ప్రధాని మోడీపై చైనా మీడియా ప్రశంసల వర్షం

గల్వాన్ లో చైనా-ఇండియా సైనికుల ఘర్షణ గురించి ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై మన దేశంలోని విపక్షాలు

గల్వాన్ లో చైనా-ఇండియా సైనికుల ఘర్షణ గురించి ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై మన దేశంలోని విపక్షాలు ఫైర్ అయిన సంగతి తెలిసిందే. మోడీ చైనాకి లొంగిపోయారని కాంగ్రెస్ మండిపడింది. నరేంద్ర మోడీ కాదు సరెండ్ మోడీ అని విమర్శించింది. ప్రధాని మోడీ స్పీచ్ ను కాంగ్రెస్ తప్పుపడుతుంటే, చైనా మీడియా మాత్రం మరో విధంగా స్పందించింది. ప్రధాని మోడీపై చైనా మీడియా ప్రశంసల వర్షం కురిపించింది. అద్బుతంగా మాట్లాడారని కితాబిచ్చింది.

ప్రధాని స్పీచ్ రెండు దేశాల నడుమ ఉద్రిక్తతలను తగ్గించేలా ఉందని కితాబు:
గల్వాన్ లో ఘర్షణ తర్వాత భారత్-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇండో-చైనా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోడీ ఇచ్చిన స్పీచ్ కు చైనా మీడియా కితాబిచ్చింది. గల్వాన్ లో చైనా-భారత్ సైనికుల ఘర్షణ తర్వాత ప్రధాని మోడీ ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నారు. ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత మాట్లాడిన ప్రధాని మోడీ, మన దేశ భూభాగంలోకి ఎవరూ చొరబడలేదని కామెంట్ చేశారు. ప్రస్తుతం మన భూభాగంలో ఎవరూ లేరని చెప్పారు. అంతేకాదు మన సైనిక పోస్టులను ఎవరూ ఆక్రమించుకోలేదని కూడా చెప్పారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలను చైనా మీడియా వెల్ కమ్ చెప్పింది. చాలా బాగా మాట్లాడారంటూ ప్రశంసించింది. ప్రధాని కామెంట్స్ ను చైనాకు చెందిన అనేక మీడియా సంస్థలు సోషల్ మీడియాలో షేర్ చేశాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు దోహదపడే విధంగా భారత ప్రధాని మోడీ మాట్లాడారని, ఇది మంచి పరిణామం అని చైనా పత్రికలు కథనాలు రాశాయి. క్లిష్ పరిస్థితుల్లో సంయమనం కోల్పోకుండా భారత ప్రజలను, చైనాను రెచ్చగొట్టకుండా మోడీ చాలా తెలివిగా వ్యవహరించారని మెచ్చుకున్నాయి.

అసలు మోడీ ఏమన్నారంటే..
”భారత భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదు, ప్రవేశించ లేరు కూడా. మన సైనిక పోస్టులను ఎవరూ ఆక్రమించలేదు, ఆక్రమించలేరు కూడా. మేము శాంతిని కోరుకుంటాం. కానీ మా భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తే మాత్రం చూస్తూ ఊరుకోము” అని మోడీ తేల్చి చెప్పారు. అయితే మోడీ తన ప్రసంగంలో ఎక్కడ చైనా పేరు ప్రస్తావించలేదు కానీ చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ మాత్రం ఇచ్చారు.

మోడీ చైనాకి లొంగిపోయారా?
ప్రధాని మోడీ వ్యాఖ్యలను చైనా మీడియా ప్రశంసిస్తే, మన దేశంలోని విపక్షాలు మాత్రం ఫైర్ అయ్యాయి. ఇండో-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై మౌనంగా ఉన్నారంటూ ప్రధాని మోడీపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. మన దేశ భూభాగంలోకి ఎవరూ చొరబడలేదని, మన సైనిక పోస్టులను ఎవరూ ఆక్రమించుకోలేదని అఖిలపక్ష సమావేశంలో మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేతలు తప్పుపట్టారు. గల్వాన్ లో చైనా సైన్యాలు దిగలేదని చెప్పడం ద్వారా చైనాకు మోడీ లొంగిపోయారని, ఆ దేశానికి క్లీన్ చిట్ ఇస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.

చైనా దూకుడుకు భయపడ్డారా:
‘చైనా దూకుడుకు భయపడి ఇండియా భూభాగాన్ని డ్రాగన్ కంట్రీకి అప్పగించారు. ఒకవేళ ఆ భూభాగం చైనాది అయితే మన సైనికులు ఎందుకు చంపబడ్డారు? వాళ్లు ఎక్కడ చంపబడ్డారు’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అంతేకాదు, నరేంద్ర మోడీ కాదు సరెండర్ మోడీ అని ఎద్దేవా కూడా చేశారు. ‘లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఎలాంటి చొరబాటు లేదా ఉల్లంఘన జరగకపోతే ఇరు వైపున దళాలు వెనక్కి మళ్లాలని ఎందుకన్ని చర్చలు జరిగాయి? చైనాకు ప్రధాని క్లీన్ చిట్ ఇచ్చారా? ఒకవేళ అదే నిజమైతే.. డ్రాగన్ కంట్రీతో ఇంక మాట్లాడటానికి ఏముంటుంది? మేజర జనరల్స్ అసలు దేని గురించి, ఎందుకు చర్చలు జరుపుతున్నారు? ఇండియా భూభాగంలో ఏ విదేశీయులూ (చైనీయులు) లేరని ప్రధాని అంటున్నారు. అదే నిజమైతే, మే 5-6 తేదీల్లో జరిగిందేంటి? ఈ నెల 16-17 తేదీల్లో దళాల మధ్య ఫైట్ ఎందుకు జరిగింది? మనం ఆర్మీ 20మంది సైనికుల ప్రాణాలను ఎందుకు కోల్పోయింది’ అని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ప్రశ్నలు సంధించారు.

Read: దేశంలో కొత్తగా 14,821 కరోనా కేసులు.. 445 మంది మృతి