సుత్తి, కత్తి, నిప్పుతో కటింగ్, కస్టమర్ల క్యూ..వీడియో వైరల్
పాకిస్తాన్ లోని లాహోర్ చెందిన ఆలీ అబ్బాస్ కటింగ్ షాపు నిర్వహిస్తుంటాడు. వచ్చిన కస్టమర్లకు వెరైటీగా కటింగ్ చేస్తూ..పాపులర్ అయ్యాడు.

Lahore barber
Lahore barber : జుట్టు ఎక్కువగా కాగానే..కటింగ్ చేయించుకొనేందుకు బార్బర్ షాప్ కు వెళుతాం. ఒక్కోక్కరు ఒక్కో విధంగా కటింగ్ చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో వెరైటీ వెరైటీగా జుత్తును కత్తిరించుకుంటున్నారు. అయితే..ఎవరైనా కటింగ్ చేస్తే..కత్తెర..ఇతర సాధనాలను వాడుతుంటారు. కానీ..ఒక బార్బర్ మాత్రం వినూత్నంగా వెంట్రుకలను కత్తిరిస్తున్నాడు. సుత్తి, మాంసం కొట్టే కత్తితో చేస్తున్న వీడియో వైరల్ గా మారింది.
పాకిస్తాన్ లోని లాహోర్ చెందిన ఆలీ అబ్బాస్ కటింగ్ షాపు నిర్వహిస్తుంటాడు. వచ్చిన కస్టమర్లకు వెరైటీగా కటింగ్ చేస్తూ..పాపులర్ అయ్యాడు. నెత్తిపై మంట పెడుతూ..జుట్టును కత్తిరిస్తుంటాడు. సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించడానికి అబ్బాస్ శిక్షణ పొందారు. ఒకేలా జుట్టు కత్తిరిస్తే..ఏముంటుంది అనుకున్నాడో..ఏమో..మాంసం కొట్టే కత్తి, నిప్పు, సుత్తితో కటింగ్ చేయడం ప్రారంభించాడు. కొత్త కొత్త మార్గాలతో జనాలను ఆకర్షించే ప్రయత్నం మొదలు పెట్టాడు. ఇబ్బంది లేకుండా..ఉండటానికి తాను సంవత్సరం పాటు శిక్షణ పొందినట్లు అబ్బాస్ వెల్లడించారు. మహిళలకు, పురుషులకు ఇదే విధంగా కటింగ్ చేస్తున్నాడు.
కటింగ్ షాపుకు వెళ్లగానే..ఎక్కడ కత్తి గాటు పడుతుందోనన్న భయం అందరిలో ఉంటుంది. కానీ..ఒక్క గాటు కూడా పడకుండా..ఇతను చేస్తున్న కటింగ్ పాపులర్ అయ్యింది. కత్తి, సుత్తితో కటింగ్ ఎలా చేస్తారు..? జరగరానిది ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు ? అని ప్రశ్నిస్తారా ? కానీ..ఎలాంటి హానీ జరుగకుండా..ఇతను కటింగ్ చేస్తున్నాడు. అదే అతడి స్పెషాలిటి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.