Lakshya Sen : చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్.. ఆల్ ఇంగ్లండ్ టోర్నీ ఫైన‌ల్‌కు భారత యువ షట్లర్

భార‌త బ్యాడ్మింట‌న్ క్రీడాకారుడు ల‌క్ష్య‌సేన్ స‌త్తా చాటుతున్నాడు. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్‌షిప్ టోర్నీలో...

Lakshya Sen : చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్.. ఆల్ ఇంగ్లండ్ టోర్నీ ఫైన‌ల్‌కు భారత యువ షట్లర్

Lakshya Sen

Lakshya Sen : భార‌త యువ స్టార్ బ్యాడ్మింట‌న్ క్రీడాకారుడు ల‌క్ష్య‌సేన్(20) హిస్టరీ క్రియేట్ చేశాడు. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్‌షిప్ టోర్నమెంట్ లో భార‌త ఆట‌గాళ్లంతా నిరుత్సాహ ప‌ర‌చ‌గా.. ల‌క్ష్య‌సేన్ మాత్రం అదరగొట్టాడు. టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు. శ‌నివారం రాత్రి జ‌రిగిన సెమీస్‌లో మ‌లేషియా ఆట‌గాడు లీ జీ జియాపై 21- 13, 12-21, 21-19 తేడాతో విజ‌యం సాధించి, ఫైనల్ కి చేరాడు.

ఫైన‌ల్ చేర‌డంతోనే ఓ రికార్డును సొంతం చేసుకున్న ల‌క్ష్య‌సేన్.. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్‌షిప్‌లో సింగిల్స్ విభాగంలో ఫైన‌ల్ చేరిన ఐదో భార‌త ఆటగాడిగా రికార్డుల‌కెక్కాడు. త‌న జైత్ర‌యాత్ర‌ను ఫైన‌ల్‌లోనూ కొన‌సాగిస్తే.. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్ షిప్ గెలిచిన మూడో భార‌తీయుడిగా ల‌క్ష్య‌సేన్ రికార్డుల‌కెక్క‌నున్నాడు. ఇంతకుముందు ప్రకాశ్‌ నాథ్‌ (1947, రన్నరప్‌), ప్రకాశ్‌ పదుకొణె (1980-విజేత, 1981-రన్నరప్), పుల్లెల గోపీచంద్ (2001, విజేత), సైనా నెహ్వాల్ (2015, రన్నరప్‌) ఫైనల్‌కు చేరిన వారిలో ఉన్నారు.(Lakshya Sen)

శనివారం గంట 16 నిమిషాల పాటు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో లక్ష్యసేన్ 21-13, 12-21, 21-19తో మాజీ చాంపియన్ లీ జి జియా (మలేషియా)పై సూపర్ విక్టరీ సాధించాడు. ఇక ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. క్వార్టర్ ఫైనల్లో లక్షసేన్ కు వాకోవర్ లభించింది. అతడి ప్రత్యర్థి గాయంతో మ్యాచ్ నుంచి తప్పుకోవడంతో లక్ష్యసేన్ నేరుగా సెమీఫైల్లోకి అడుగుపెట్టాడు. ఇక సెమీఫైనల్లో మలేషియాకు చెందిన మాజీ చాంపియన్ లీ జి జియాతో తలపడ్డాడు. తొలి గేమ్ లో వరుస పాయింట్లతో హోరెత్తించిన లక్ష్యసేన్ 21-13తో సొంతం చేసుకున్నాడు. అనంతరం పుంజుకున్న లీ జి జియా… రెండో గేమ్ లో మంచి ఆటతీరు కనబరిచాడు. స్మాష్ షాట్లతో పాటు సుదీర్ఘ ర్యాలీ షాట్లతో లక్ష్యసేన్ పై ఒత్తిడిని పెంచాడు. దాంతో లక్ష్యసేన్ పాయింట్ల కోసం కష్టపడ్డాడు. అదే సమయంలో అనవసర తప్పిదాలతో గేమ్ ను దూరం చూసుకుని మూల్యం చెల్లించుకున్నాడు. దాంతో మ్యాచ్ నిర్ణాయక మూడో గేమ్ కు వెళ్లింది.

Asia Cup 2022 : క్రికెట్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఆగస్టు 27 నుంచి ఆసియా కప్.. ఈసారి టీ20 ఫార్మాట్‌లో..

మూడో గేమ్ ఆరంభంలో మలేషియా షట్లర్ దూకుడు కనబరిచాడు. దాంతో 11-9తో ఒకసారి… 14-12తో రెండోసారి మలేషియా షట్లర్ ఆధిక్యంలో నిలిచాడు. అయితే తీవ్ర ఒత్తిడి మధ్య అద్భుత ఆటతీరు కనబరిచిన లక్ష్యసేన్ వరుసగా పాయింట్లు సాధించి అంతరాన్ని తగ్గించాడు. దాంతో ఇరువురు కూడా 18-18తో సమంగా నిలిచాడు. అయితే ఇక్కడ వరుసగా మూడు పాయింట్లు సాధించిన లక్ష్యసేన్ 20-18తో మ్యాచ్ పాయింట్ కు వచ్చాడు. అనంతరం లీ జి జియా ఒక పాయింట్ సాధించినా… ఆ తర్వాత వెంటనే పాయింట్ సాధించిన లక్ష్యసేన్ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిప్ ఫైనల్ కి ప్రవేశించిన మూడో ఇండియన్ ప్లేయర్ గా ఘనత కెక్కాడు. ఓవరాల్ గా నాలుగో ఇండియన్ (మహిళల విభాగాన్ని కలుపుకుంటే). సైనా నెహ్వాల్ 2015లో రన్నరప్ గా నిలిచింది. ఓ భారత ఆటగాడు ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరడం ఏడేళ్ల తర్వాత ఇదే.