Malaysian Landslide: మలేషియాలో విరిగిపడిన కొండచరియలు.. ఎనిమిది మంది మృతి, పలువురు గల్లంతు

మలేషియాలోని క్యాంప్‌సైట్‍‌లో విషాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటనలో 92 మంది కొండచరియల కింద చిక్కుకున్నారు. సెర్చ్ అండ్ రెస్క్యూ సిబ్బంది రంగంలోకిదిగి 53మందిని మందిని క్షేమంగా బయటకు తీశారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలు కావటంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Malaysian Landslide: మలేషియాలో విరిగిపడిన కొండచరియలు.. ఎనిమిది మంది మృతి, పలువురు గల్లంతు

Malaysian Landslide

Malaysian Landslide: మలేషియాలోని క్యాంప్‌సైట్‍‌లో విషాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటనలో 92 మంది కొండచరియల కింద చిక్కుకున్నారు. సెర్చ్ అండ్ రెస్క్యూ సిబ్బంది రంగంలోకిదిగి 53మందిని మందిని క్షేమంగా బయటకు తీశారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలు కావటంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పదుల సంఖ్యలో స్థానికుల ఆచూకీ లభించలేదు. వారికోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. శుక్రవారం తెల్లవారు జామున 3గంటల సమయంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

Italy Landslide 7 Dead : ఇటలీలో ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి

మలేషియా రాజధాని కౌలాలంపూర్ శివార్లలోని సెలంగోర్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక, రెస్క్యూ డిపార్ట్ మెంట్ సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ విషాధ ఘటనపై రెస్క్యూ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ.. కొండచరియలు క్యాంప్ సైట్ నుండి 30 మీటర్ల (100 అడుగులు) ఎత్తు నుంచి పడిపోయాయని, ఈ కొండచరియలు సుమారు ఎకరం ప్రదేశాన్ని చుట్టుముట్టాయని తెలిపారు.

Venezuela Landslide : వెనిజులాలో విరిగిపడ్డ కొండచరియలు .. 22మంది మృతి, 52మంది పైగా గల్లంతు

ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారిని పోలీసులు గుర్తించారు. మిగిలిన వారి శరీరాలు కొండచరియల కింద పడి ఛిన్నాభిన్నం అయ్యాయి. గల్లంతైన వారికోసం విరిగిపడిన కొండచరియలను తొలగిస్తున్నారు. అయితే, వీరిలో కొందరు మరణించికూడా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఎక్కువ మందిని కాపాడే ప్రయత్నాల్లో రెస్క్యూ టీం సిబ్బంది నిమగ్నమయ్యారు.