కరోనా వైరస్ ఒకసారి తగ్గితే నాలుగు నెలల వరకూ ఏ ఢోకా లేదు – స్టడీ

కరోనా వైరస్ ఒకసారి తగ్గితే నాలుగు నెలల వరకూ ఏ ఢోకా లేదు – స్టడీ

కరోనావైరస్ ను పోరాడి గెలిచిన వారి శరీరంలో యాంటీబాడీస్ అనేవి దాదాపు నాలుగు నెలల పాటు సజీవంగా ఉంటాయి. గతంలో చెప్పిన సైంటిస్టుల మాదిరిగానే లేటెస్ట్ స్టడీలోనూ ఫలితాలు అదే విధమైన ఫలితాలు బయటపడ్డాయి. ఐస్‌ల్యాండ్ లోని దాదాపు 30 వేల మందిపై ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్ గురించి పరీక్షలు నిర్వహించారు.



వ్యాక్సిన్ డెవలప్‌మెంట్‌లో భాగంగా.. జరిపిన పరీక్షల్లో వారందరిలో వచ్చిన ఫలితాలను బట్టి ఈ విషయం తెలిసింది. ఒకవేళ వ్యాక్సిన్ అనేది యాంటీబాడీలు సుదీర్ఘ కాలం ఉండేలా ఉత్పత్తి చేయగలిగితే.. అది ఇమ్యూనిటీతో పాటు అతి పెద్ద మహమ్మారి.. ప్రాణాంతక వైరస్ ల నుంచి పోటీపడగల సామర్థ్యాన్ని కూడా ఇవ్వగలదు. వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే యాంటీబాడీలు కరోనావైరస్ నుంచి మనల్ని నాలుగు నెలల వరకూ కాపాడగలవు.
https://10tv.in/centre-informs-sc-moratorium-period-capable-being-extended-upto-two-years/
హార్వార్డ్ యూనివర్సిటీ, అమెరికాలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ లు సంయుక్తంగా న్యూఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ కథనంపై స్పందించాయి.



కరోనావైరస్ నుంచి గెలిచిన వారు ఫ్యూచర్ ఇన్ఫెక్షన్ నుంచి ఎలా బయటపడగలరు. వారిలోని యాంటీబాడీస్ ఎంతమేర పనిచేయగలవు అనే పెద్ద రహస్యాన్ని చేధించారు. కొన్ని చిన్నపాటి స్టడీలు ఇదే అంశంపై అధ్యయనం జరిపి కరోనావైరస్ యాంటీబాడీలు శరీరంలో నుంచి చాలా త్వరగా కనుమరుగవుతాయని చెప్పాయి. దాని కారణంగా కొందరిలో లక్షణాలు కనిపించొచ్చు. కనిపించకుండా పోవచ్చని వెల్లడించాయి.

ఈ రీసెంట్ స్టడీని యూఎస్ బయోటెక్ కంపెనీ అంజెన్ సబ్సీడరీ డీకోడ్ జెనెటిక్స్ ఆధారితమైన రేక్జేవిక్ నిర్వహించారు. పలు హాస్పిటళ్లు, యూనివర్సిటీలు, హెల్త్ అఫీషియల్స్ డేటా ఆధారంగా దీనిని నిర్దారించారు.