Israel : ఇజ్రాయెల్ రక్షణ రంగంలో లేజర్‌ వాల్‌ టెక్నాలజీ

త్వరలో ఆ దేశం మొత్తం లేజర్‌ భద్రతలోకి వెళ్లిపోతుంది. మరో ఏడాదిలోగా దక్షిణ ఇజ్రాయెల్‌లో దీన్ని మోహరించనున్నారు.

Israel : ఇజ్రాయెల్ రక్షణ రంగంలో లేజర్‌ వాల్‌ టెక్నాలజీ

Israel (1)

laser wall technology : టెక్నాలజీ వినియోగంలో అందరికంటే ముందుండే ఇజ్రాయెల్ మరో సరికొత్త టెక్నాలజీ అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఐరన్ డోమ్ టెక్నాలజీ మిస్సైళ్లను అడ్డుకుంటున్న ఇజ్రాయెల్… ఇప్పుడు లేజర్ వాల్ దిశగా అడుగులు వేస్తోంది. లేజర్ కిరణాలతో మిస్సైళ్లను అడ్డుకునే టెక్నాలజీని అతి త్వరలో తీసుకురాబోతున్నట్లు ఆ దేశ ప్రధాని నప్తాలీ బెన్నెట్ ప్రకటించారు.

త్వరలో ఆ దేశం మొత్తం లేజర్‌ భద్రతలోకి వెళ్లిపోతుంది. మరో ఏడాదిలోగా దక్షిణ ఇజ్రాయెల్‌లో దీన్ని మోహరించనున్నారు. గాజా దాడులకే కాదు ఇరాన్‌కు కూడా ఈ టెక్నాలజీతో ఇజ్రాయెల్ సవాల్‌ విసరబోతోంది. ఇంతకీ ఈ లేజర్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందన్నది ప్రధాని వివరించలేదు.

Ratan TATA : ఎయిర్‌ఇండియా ప్రయాణికులకు రతన్‌టాటా ఆడియో మెసేజ్‌

అయితే ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం గాల్లో లేదా ఆకాశంలో లేదా నీటిలో అయినా వీటిని మోహరించవచ్చు. లాంగ్‌రేంజ్‌, షార్ట్‌రేంజ్‌ మిస్సైల్‌ ఏదైనా చివరకు డ్రోన్ అయినా సరే లేజర్‌ దెబ్బకు కుప్పకూలాల్సిందే. వీటిని గుర్తించిన మరుక్షణమే శక్తిమంతమైన కిరణాలు దాని దిశగా దూసుకెళతాయి. వేగం తగ్గించినా, దిశ మార్చుకున్నా వదిలిపెట్టవు.

కుప్పకూల్చి అదృశ్యమైపోతాయి. జూన్‌ నుంచే ఇజ్రాయెల్ దీన్ని టెస్ట్‌ ట్రయల్స్ చేస్తోంది. ఈ న్యూ జనరేషన్‌ డిఫెన్స్ సిస్టమ్‌ ఒక్కోసారి ప్రయోగానికి అయ్యే ఖర్చు కేవలం కొన్ని డాలర్లు మాత్రమే. అదే ఓ ఐరన్‌ డోమ్‌ బ్యాటరీ మార్చాలంటేనే 10కోట్ల డాలర్ల ఖర్చవుతుంది. అందుకే ఇజ్రాయెల్‌ లేజర్‌ టెక్నాలజీ వైపు చూస్తోంది.