Lebanon : తీవ్ర ఆర్థిక సంక్షోభంలో లెబనాన్‌..పెట్రోల్ రూ.320.. బ్రెడ్ రూ.288

లెబనాన్ ఆర్ధిక పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఆహార కొరత ఏర్పడటంతో నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగాయి.

Lebanon : తీవ్ర ఆర్థిక సంక్షోభంలో లెబనాన్‌..పెట్రోల్ రూ.320.. బ్రెడ్ రూ.288

Lebanon

Lebanon : పశ్చిమ ఆసియా దేశమైన లెబనాన్ ఆకలితో అలమటిస్తోంది. దేశంలో ఆహారం కొరత ఏర్పడింది. ఆహారం కంటే 8 రేట్లు ఖరీదైనదిగా నీరు మారింది. నిత్యావసర వస్తువుల రేట్లన్నీ వివరితంగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్, ఆహార పదార్ధాల కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది. విద్యుత్ సరఫరాను లిమిట్ చేశారు. రోజుకు ఒక గంట మాత్రమే విద్యుత్ సరఫరా ఉంటోంది. ఆసుపత్రుల్లో మందులు నిండుకోవడంతో వైద్యం అటకెక్కింది.. పాఠశాలలు మూతబడ్డాయి.

Read More : Wipro : రేపటి నుంచి ఉద్యోగులు ఆఫీసుకి రావాలి

తిండి దొరక్క పిల్లలో పోషకాహార లోపం వస్తుందని అక్కడి వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ సమస్యల మధ్యే లెబనాన్ కొత్త ప్రధానిగా నజీబ్ మికటి రెండు రోజుల క్రితం బాధ్యతలు చేపట్టారు. గతంలో కూడా ఈయన ప్రధానమంత్రిగా పనిచేశారు. ప్రధాని పదవి చేపట్టేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో నజీబ్ మరోసారి బాధ్యతలు చేపట్టారు. కాగా ప్రధాని నజీబ్ లెబనాన్ లోనే అత్యంత ధనవంతుడు.

ఇదిలా ఉంటే గత ఏడాది ఆగస్టు 4 న బీరుట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 200 మందికి పైగా పౌరులు మరణించారు. అనంతరకాలంలో దేశంలో రాజకీయ గొడవల కారణంగా ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. దేశంలో నిత్యావసరాల కరువు ఏర్పడటంతో వస్తువుల ధరలు అమాంతం పెరిగాయి. జనవరిలో లీటర్ డీజిల్ 1000 లెబనీస్ పౌండ్లకు లభ్యమైతే.. ఇప్పుడు 6500 లెబనీస్ పౌండ్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో 1000 లెబనీస్ పౌండ్లకు దొరికిన బ్రెడ్.. ఇప్పుడు 6000 లెబనీస్ పౌండ్లకు చేరింది. భారత కరెన్సీలో రూ.288 అన్నమాట..

Read More : PAKA Movie : 46వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) లో ‘పాక’..

ప్రస్తుతం ఆ దేశ ప్రజలు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారు. ఇక ఇదే తరహా ఆహార కొరత శ్రీలంకలో కూడా ఏర్పడింది. మరో వైపు అఫ్ఘానిస్థాన్ లో కూడా నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 150 ఏండ్లలో లెబనాన్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత అధ్వాన్న స్థితిలో ఉన్నదని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. గత రెండు సంవత్సరాలుగా ఆర్థిక సంక్షోభం కారణంగా లెబనాన్‌లో పరిస్థితి మరింత దిగజారింది. జనాభాలో 78 శాతం మంది పేదరికాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ సంక్షోభం గందరగోళ పరిస్థితికి దారితీయవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.