Life On Mars : అంగారకుడిపై భూగర్భ సరస్సుల్లో ఏలియన్స్ దాగి ఉండొచ్చు : బయటపెట్టిన సైంటిస్టులు

  • Published By: sreehari ,Published On : September 29, 2020 / 07:20 PM IST
Life On Mars : అంగారకుడిపై భూగర్భ సరస్సుల్లో ఏలియన్స్ దాగి ఉండొచ్చు : బయటపెట్టిన సైంటిస్టులు

Life On Mars : అంగారకుడిపై ఏలియన్స్ ఉన్నారా? భూగ్రహం మాదిరిగానే రెడ్ ప్లానెట్ (మార్స్) పై కూడా ఏదైనా జీవం ఉండి ఉండొచ్చునని సైంటిస్టులు గట్టిగా నమ్ముతున్నారు. అంగారకుడిపై భూగర్భ సరస్సుల్లో ఏలియన్స్ జీవం దాగి ఉందంటూ సైంటిస్టులు బయటపెట్టేశారు.



అంగారక గ్రహంపై మంచుతో కూడిన భూగర్భ ఉప సరస్సుల్లో మైక్రో బయాల్ (సూక్ష్మజీవులు) జీవం ఉనికికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఇటలీలోని Roma Tre University చెందిన పరిశోధకులు ప్రొఫెసర్ Elena Pettinelli వెల్లడించారు.

Life On Mars ఏలియన్స్ జీవం ఉందా? :

అలా ఉండి ఉంటే మనుషుల్లానే అంగారకుడిపై ఏలియన్స్ జీవం (Alien life)  తప్పక ఉండే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏలియన్స్ జీవం ఉందా? లేదా అనేక సందేహాలకు కచ్చితమైన ఆధారాలు లభించలేదు. కానీ, ఏదైనా గ్రహంపై నీరు ఉంది అంటే కచ్చితంగా అక్కడ ఏదైనా జీవం ఉద్భవించే ఉంటుందనే అంచనాకు వస్తున్నారు సైంటిస్టులు. ఇప్పుడు అంగారకుడిపై కూడా ఏలియన్స్ జీవం దాగి ఉండొచ్చునని భావిస్తున్నారు. భూగర్భ సరస్సుల్లో (underground lakes on Mars)  ఏలియన్స్ ఉనికి ఉంటుందని సైంటిస్టులు రివీల్ చేశారు.




బోల్గోనాలో ఇటలీ National Institute of Astrophysics ప్రొఫెసర్ Roberto Orosei చెప్పిన ప్రకారం.. మంచు పలకల కింద అగ్నిపర్వతాలు ఉండటంతో అలాంటి అసాధారణ పరిస్థితుల మధ్య ఉప సరస్సు ఆవిర్భావించి ఉండొచ్చునని అంటున్నారు. అంగారకుడి చరిత్రలో ఇలాంటి మరెన్నో సరస్సులు పుట్టుకురావడం సర్వ సాధారణమైనదిగానే సైంటిస్టులు చెబుతున్నారు.



భూ ఉపరితలం మాదిరిగానే అంగారకుడి ఉపరితలంపై కూడా నీరు ఉండటం.. అక్కడి వాతావారణం జీవం ఆవిర్భావానికి దోహదపడుతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. మార్స్ ఎక్స్‌ప్రెస్ ఆర్బిటర్ నుంచి వచ్చిన డేటా విశ్లేషణలో ఇక్కడి సరస్సులు ఉప్పుతో సమృద్ధిగా ఉన్నాయని కనుగొన్నారు.