Messi Income: లెజెండ్ ఫుట్‭బాలర్ లియోనెల్ మెస్సీ సంపాదన.. ఈ భూమ్మీద మరే ఆటగాడికీ లేదట!

ఆడిడాస్, బడ్‭వైజర్, పెప్సీకో లాంటి సంస్థలతో 35 ఏళ్ల ఒప్పందం ఉంది. ఇది కాకుండా క్రిప్టో కరెన్సీ ఫ్యాన్ టోకెన్ ఫ్లాట్‭ఫాం సోషియోస్‭తో 20 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడు. ఫోర్బ్స్ తెలిపిన వివరాల ప్రకారం.. అటు ఆటగాడిగా ఇటు బిజినెస్ నడిపిస్తూ మొత్తంగా 1.15 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువే సంపాదించినట్లు తెలుస్తోంది. మెస్సీ కంటే ఎక్కువగా లెబ్రాన్ జేమ్స్, క్రిస్టియానో రొనాల్డో, టైగర్ వుడ్స్ మాత్రమే సంపాదిస్తున్నారు

Messi Income: లెజెండ్ ఫుట్‭బాలర్ లియోనెల్ మెస్సీ సంపాదన.. ఈ భూమ్మీద మరే ఆటగాడికీ లేదట!

Lionel Messi is the highest-paid athlete on the planet

Messi Income: అన్ని రకాల ఫార్మట్‭లలో ట్రోపీలు అందుకున్న మెస్సీ.. తాజాగా చిరకాల స్వప్నమైన ఫిఫా ప్రపంచ కప్‭ని కూడా ముద్దాడాడు. ఫుట్‭బాల్ ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతున్న మెస్సీ.. ఆటలోనే కాదు, ఆస్తుల్లోనూ మిగిలిన ఆటగాళ్ల కంటే ముందున్నాడు. గతేడాది అయితే ప్రపంచంలోని అందరి ఆటగాళ్ల కంటే ఎక్కువగా మెస్సీనే సంపాదించినట్లు ఫోర్స్బ్ పేర్కొంది. ఆ యేడాదిలో మెస్సీ 75 మిలియన్ డాలర్లు సంపాదించాడట. ఇక మెస్సీ మొత్తం ఆస్తులు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

OTT Platforms: ఓటీటీలపై కొరడా ఝుళిపించనున్న బ్రిటన్.. రూల్స్ అతిక్రమిస్తే రూ2.5 కోట్ల జరిమానా

ఇకపోతే, ఫుట్‭బాల్ పారిస్ సేయింట్ జర్మైన్ ఎఫ్‭సీ మాత్రమే ఇచ్చే జీతం ఏడాదికి 35 మిలియన్ డాలర్లు. అంటే ఒక రోజులో ఒక్క ఫుట్‭బాల్ పారిస్ సేయింట్ జర్మైన్ ఎఫ్‭సీ నుంచే మెస్సీ 1,05,000 డాలర్లు సంపాదిస్తున్నాడు. ఇక అర్జెంటీనా ఫ్రెంచ్ జట్టు కోసం సైన్ చేసిన మెస్సీ, దాన్నుంచి 25 మిలియన్ డాలర్లు సంపాదించాడట. గతేడాది ఆఫ్ ఫీల్డ్ మీద 55 మిలియన్ డాలర్లు సంపాదించిన మెస్సీ.. టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్, ఎన్‭బీఏ సూపర్ స్టార్ లెబ్రాన్ జేమ్స్‭ల తర్వాత అత్యధికంగా సంపదిస్తున్న ఆటగాళ్లలో మూడో స్థానంలో నిలిచాడు.

Lionel Messi: లియోనెల్ మెస్సీకి ఏడోసారి అవార్డు.. ఎవరూ టచ్ చేయని రికార్డు!

ఇక.. ఆడిడాస్, బడ్‭వైజర్, పెప్సీకో లాంటి సంస్థలతో 35 ఏళ్ల ఒప్పందం ఉంది. ఇది కాకుండా క్రిప్టో కరెన్సీ ఫ్యాన్ టోకెన్ ఫ్లాట్‭ఫాం సోషియోస్‭తో 20 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడు. ఫోర్బ్స్ తెలిపిన వివరాల ప్రకారం.. అటు ఆటగాడిగా ఇటు బిజినెస్ నడిపిస్తూ మొత్తంగా 1.15 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువే సంపాదించినట్లు తెలుస్తోంది. మెస్సీ కంటే ఎక్కువగా లెబ్రాన్ జేమ్స్, క్రిస్టియానో రొనాల్డో, టైగర్ వుడ్స్ మాత్రమే సంపాదిస్తున్నారు. విలాసవంతమైన భవనాలు, ఖరీదైన కార్లు, ప్రైవేట్ జెట్, ఫుట్‭బాల్ పిచ్ లాంటి ఆస్తులు కూడా బాగానే ఉన్నాయట.

Abdul Khaleque: ఫుట్‭బాల్ లెజెండ్ మెస్సీ భారతీయుడేనట.. ఒక్క ట్వీట్‭తో తేల్చేసిన కాంగ్రెస్ ఎంపీ

అయితే ఆస్తులతో పాటు మెస్సీ మనసు కూడా చాలా బరువే. దానదర్మాలు చేయడంలో మెస్సీ ముందుంటారు. 2007లో యూనిసెఫ్ భాగస్వామ్యంతో లియోనెల్ మెస్సీ ఫౌండేషన్ ప్రారంభమైంది. దీని ద్వారా పోషకాహరంతో బాధపడుతున్న చిన్నారులకు ప్రపంచ వ్యాప్తంగా సహాయం అందిస్తున్నారు.