Lip Allergies: కాంస్య యుగంలో ముద్దులు.. ఇప్పట్లో పెదాలపై దద్దర్లకు లింక్

ఏదో ఒక సందర్భంలో పెదాలపై పుండ్ల రూపంలో కనిపించే సమస్య ఇటీవల వచ్చింది కాదట. కాంస్య యుగంలో పెట్టుకున్న ముద్దుల కారణంగా అది జరిగి ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కేంబ్రిడ్జ్‌లోని సైంటిస్టులు పెదాలపై ఏర్పడే పుండ్లకు సింప్లెక్స్ వైరస్ కారణమని గుర్తించారు.

Lip Allergies: కాంస్య యుగంలో ముద్దులు.. ఇప్పట్లో పెదాలపై దద్దర్లకు లింక్

 

Lip Allergies:  ఏదో ఒక సందర్భంలో పెదాలపై పుండ్ల రూపంలో కనిపించే సమస్య ఇటీవల వచ్చింది కాదట. కాంస్య యుగంలో పెట్టుకున్న ముద్దుల కారణంగా అది జరిగి ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కేంబ్రిడ్జ్‌లోని సైంటిస్టులు పెదాలపై ఏర్పడే పుండ్లకు సింప్లెక్స్ వైరస్ కారణమని గుర్తించారు. దీని శాంపుల్స్ పరీక్షించగా అవి 4వేల 500 సంవత్సరాల క్రితం వేరియంట్ అని తెలిసింది.

పూర్వీకుల నుంచి ఈ వైరస్ వ్యాపించిందని.. వైరాలజిస్ట్ డాక్టర్ షార్లెట్ హౌల్డ్‌క్రాఫ్ట్ చెప్పారు. హెర్పెస్ సింప్లెక్స్ వైరస్, లేదా HSV-1, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 బిలియన్ల మందికి సోకుతుంది. మానవులు విడిపోవడానికి ముందు పెట్టుకునే ముద్దుల వల్ల ఇది ఉద్భవించిందని భావిస్తున్నారు. పురాతన DNA ఆఫ్రికా నుంచి ఎలా విస్తరించిందనే దానిపై సైంటిస్టులు ఇంకా అస్పష్టంగానే ఉన్నారు.

దాదాపు 3వేల పురావస్తు ప్రదేశాలలో కనిపించిన కొందరి DNAను పరీక్షించారు. హెర్పెస్ ఇన్‌ఫెక్షన్‌లను ఉన్న UK, నెదర్లాండ్స్, రష్యాకు చెందిన నలుగురి నమూనాలపై పరీక్షలు జరిపారు.

Read Also: ప్రేమ జంటలతో విసిగిపోయిన ప్రజలు ‘నో కిస్సింగ్ జోన్’ అంటూ బోర్డ్ పెట్టేశారు

ఉరల్ పర్వతాలలోని శ్మశానవాటిక నుండి సుమారు 1,500 సంవత్సరాల నాటి అస్థిపంజరం మొదటిది. కేంబ్రిడ్జ్ ప్రాంతంలో ఖననం చేసిన మరో ఇద్దరివి. 1672లో ఫ్రెంచ్ దాడికి బలి అయిన రైన్ ఒడ్డున ఉన్న శ్మశాన వాటికలో నాలుగో అస్థిపంజరం దొరికింది.

పురాతన DNA విశ్లేషణ ప్రకారం.. అప్పుడు హెర్పెస్ వైరస్ ఈ రోజు కనిపించే వైరస్‌తో సమానంగా ఉందని కాంస్య యుగంలో ముద్దులు పెట్టుకోవడం వల్ల వ్యాపించిందని, ఈ వేరియంట్ ఇప్పటిది కాదని తెలిసింది. అప్పట్లో బహిరంగంగా ముద్దులు పెట్టుకునే సంస్కృతి వల్లే దీని వ్యాప్తి ఎక్కువగా ఉందని తెలిసింది. ఈ వ్యాప్తిని అడ్డుకోవడానికి చక్రవర్తి టిబెరియస్ అధికారిక కార్యక్రమాల్లో ముద్దులు పెట్టుకోవడాన్ని నిషేదించారు.