British PM Rishi Sunak: బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఏకగ్రీవ ఎన్నిక.. మాజీ ప్రధాని లిజ్ ట్రస్ ఏమన్నారంటే..

లిజ్ ట్రస్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 44 రోజుల కాలంలోనే రాజీనామా చేశారు. ఆమె ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తీసుకున్న నిర్ణయాలతో దేశం ఎప్పుడూ లేనంత రీతిలో రాజకీయ, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది.

British PM Rishi Sunak: బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఏకగ్రీవ ఎన్నిక.. మాజీ ప్రధాని లిజ్ ట్రస్ ఏమన్నారంటే..

Liz Truss

British PM Rishi Sunak: బ్రిటన్ ప్రధానిగా భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్న తరువాత బ్రిటన్ మొదటి భారతీయ సంతతికి చెందిన ప్రధాన మంత్రిగా రిషి సునాక్ ఎన్నికయ్యారు. వెస్ట్‌మిన్‌స్టర్‌లోని అత్యంత సంపన్న రాజకీయ నాయకులలో ఒకరిగా పేరుగాంచిన 42ఏళ్ల సునాక్ ఆధునిక కాలంలో దేశంలోని అతి పిన్న వయస్కుడైన నాయకుడిగా మారారు. రెండు నెలల కంటే తక్కువ వ్యవధిలో రిషి సునాక్ మూడవ ప్రధాని కావటం విశేషం.

Rishi Sunak Hindu : ‘నేను హిందువునే..’ గర్వంగా చెప్పుకున్న రిషి సునక్.. బ్రిటన్ తొలి హిందూ ప్రధానిగా చరిత్ర

మంగళవారం కింగ్ చార్లెస్ చేత యూకే కొత్త ప్రధానమంత్రిగా నియమింపబడే సునాక్.. బ్రిటిష్ రాజకీయ చరిత్రలో అత్యంత క్లిష్టమైన సమయంలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అక్టోబరు 20న యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన లిజ్ ట్రస్, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా, బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా నియమితులైనందుకు సునాక్‌ను అభినందించారు.

లిజ్ ట్రస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో.. “కన్సర్వేటివ్ పార్టీ నాయకుడిగా, మా తదుపరి ప్రధానమంత్రిగా నియమితులైనందుకు రుషి సునక్‌కు అభినందనలు. మీకు నా పూర్తి మద్దతు ఉంటుంది అంటూ పేర్కొన్నారు. లిజ్ ట్రస్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 44 రోజుల కాలంలోనే రాజీనామా చేశారు. ఆమె ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తీసుకున్న నిర్ణయాలతో దేశం ఎప్పుడూ లేనంత రీతిలో రాజకీయ, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఈ క్రమంలో ఆమెపై సొంత పార్టీ సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. దీంతో గత రెండు రోజుల క్రితం ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది.