Liz Truss’ victory over Rishi Sunak: భారత సంతతి నేత రిషి సునక్ ఓటమి.. బ్రిటన్ కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నిక

బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి హోదాకు పోటీ చేసిన ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంత‌తి నేత రిషి సునక్ ఓడిపోయారు. కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలిగా లిజ్‌ ట్రస్ ఎన్నికయ్యారు. దీంతో ఆమె త్వరలోనే బ్రిటన్ ప్రధాని బాధ్యతలు స్వీకరించనున్నారు. బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి నుంచి బోరిస్‌ జాన్సన్‌ వైదొలగుతున్న నేపథ్యంలో ఆ ప‌ద‌వికి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

Liz Truss’ victory over Rishi Sunak: భారత సంతతి నేత రిషి సునక్ ఓటమి.. బ్రిటన్ కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నిక

UK PM Election 2022 Liz Truss' victory over Rishi Sunak

Liz Truss’ victory over Rishi Sunak: బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి హోదాకు పోటీ చేసిన ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంత‌తి నేత రిషి సునక్ ఓడిపోయారు. కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలిగా లిజ్‌ ట్రస్ ఎన్నికయ్యారు. దీంతో ఆమె త్వరలోనే బ్రిటన్ ప్రధాని బాధ్యతలు స్వీకరించనున్నారు. బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి నుంచి బోరిస్‌ జాన్సన్‌ వైదొలగుతున్న నేపథ్యంలో ఆ ప‌ద‌వికి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

ఇప్పటివరకు బ్రిటన్ విదేశాంగ మంత్రిగా లిజ్ ట్రస్ ఉన్నారు. ట్రిస్ ట్రస్ కు ఈ ఎన్నికల్లో 81,326 ఓట్లు రాగా, రిషి సునక్ కు 60,399 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం 82.6గా నమోదైంది. 20,927 ఓట్ల మెజార్టీతో రిషి సునాక్‌పై లిజ్ ట్రస్ గెలిచారు. రేపు బోరిస్ జాన్సన్ ప్రధాని పదవికి అధికారికంగా రాజీనామా చేస్తారు. బోరిస్ జాన్సన్ నుంచి లిజ్ ట్రస్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ గత శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగిసిన విషయం తెలిసిందే.

దీంతో నేడు కన్జర్వేటివ్‌ పార్టీ కొత్త అధినేత, బ్రిటన్ ప్రధాని పేరును ప్రకటించారు. రిషి సునాక్ గెలిస్తే బ్రిటన్ ప్రధాని పదవిని చేపట్టే తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర లిఖించేవారు. లిజ్ ట్రస్ ముందు ఇప్పుడు అనేక సవాళ్ళు ఉన్నాయి. బ్రిటన్ లో ద్రవ్యోల్బణాన్ని సమర్థంగా నియంత్రించాల్సి ఉంది. అలాగే, జీవన వ్యయం(కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌) కూడా నియంత్రించాల్సి ఉంటుంది. కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ అధికంగా ఉండడం వల్ల యూకే ఆర్థిక వ్యవస్థ దిగజారుతోందని విమర్శలు ఉన్నాయి.

China vs America: చైనా-అమెరికా పరస్పరం సైబర్ దాడులు?.. అగ్రరాజ్యంపై మళ్ళీ మండిపడ్డ డ్రాగన్