కరోనా వ్యాక్సీన్ వచ్చేంతవరకు లాక్‌డౌన్లు కొనసాగాల్సిందే : కొత్త అధ్యయనం ఇదే తేల్చింది!

  • Published By: sreehari ,Published On : April 9, 2020 / 04:13 AM IST
కరోనా వ్యాక్సీన్ వచ్చేంతవరకు లాక్‌డౌన్లు కొనసాగాల్సిందే : కొత్త అధ్యయనం ఇదే తేల్చింది!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వణికిస్తోంది. భారత్ సహా ఇతర ప్రపంచ దేశాలు కరోనా కోరల్లో చిక్కుకున్నాయి. కరోనాకు ఇప్పుడు ఎలాంటి మందు లేదు. లాక్ డౌన్ ఒక్కటే కరోనాను కంట్రోల్ చేయగల ఆయుధం. అదే తాత్కాలిక మందు కూడా. అయినప్పటికీ కరోనా కొత్త కేసులు నమోదవుతునే ఉన్నాయి. మరణాల సంఖ్య పెరిగిపోతోంది. కొత్త
కరోనా కేసులు నమోదు కాకుండా ఉండాలంటే కరోనా వైరస్ (Covid-19) వ్యాక్సీన్ రావాల్సిందే. అప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పట్టే ఆస్కారం ఉంటుంది. కానీ, ఇప్పట్లో వ్యాక్సీన్ వచ్చే పరిస్థితి లేదు. మరో 12 నుంచి 18 నెలల సమయం పట్టొచ్చు.(పెంపుడు జంతువుల నుంచి కరోనా సోకదు.. ఆందోళన పడొద్దు : వెటర్నరీ సైంటిస్టులు)

అప్పటివరకూ కరోనా కేసులను ఎలా నియంత్రించాలి? దీనికి ఒక్కటే మార్గం.. లాక్డౌన్.. అన్నిదేశాలు ఇప్పుడు కరోనాపై పోరాటంలో లాక్ డౌన్ ఆయుధాన్ని ప్రయోగిస్తున్నాయి. కానీ, చాలా దేశాలు లాక్ డౌన్ ఎత్తివేయాలని భావిస్తున్నాయి. ప్రజలను తిరిగి పనుల్లోకి వెళ్లేందుకు అనుమతిస్తూనే కొత్త కరోనా కేసులను దగ్గరగా పర్యవేక్షించాలని భావిస్తున్నాయి. వ్యాక్సీన్ వచ్చేంతవరకు లాక్ డౌన్ సడలింపుతో కొనసాగించాల్సి అవసరం ఉంది.

ఇదే ఫార్మూలాను చైనా అప్లయ్ చేసింది. కరోనాను లాక్ డౌన్‌తో కట్టడి చేసింది.. చైనా అనుభవం ఆధారంగా కొత్త అధ్యయనం ఇదే విషయాన్ని వెల్లడించింది. కొవిడ్-19 తొలి వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు డెయిలీ లైఫ్‌లో చైనా దూకుడుగా నియంత్రణ చర్యలు చేపట్టడంతోనే సాధ్యపడిందని  హాంగ్ కాంగ్ ఆధారంగా పరిశోధకులు వివరించారు. రెండోసారి వైరస్ తిరగబెడితే నిజంగా ఎంతో ప్రమాదమని అధ్యయనం చెబుతోంది. 

చైనా తరహాలో ఇలాంటి నియంత్రణ చర్యలతో కరోనా ఇన్ఫెక్షన్లను తగ్గించవచ్చు. వ్యాపారాలు, ఫ్యాక్టరీ కార్యకలాపాలు, పాఠశాలలు దశలవారీగా తెరవడం, జనమంతా ఒకే చోటకు చేరడం వంటి కారణంగా కరోనా కేసులు మళ్లీ తిరగబెట్టే అవకాశం లేకపోలేదు. ప్రత్యేకించి విదేశాల నుంచి వచ్చిన కరోనా కేసులతో మరింత ప్రమాదం ఏర్పడటమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభించే అవకాశం ఉందని University of Hong Kong ప్రొఫెసర్ Joseph T Wu నేతృత్వంలోని పరిశోధక బృందం పేర్కొంది. చైనా కరోనా కేసులను నియంత్రించింది. సగటున కరోనాతో బాధపడే వ్యక్తుల సంఖ్యను రెండు లేదా మూడు నుంచి ఒకటి కంటే తక్కువకు చేరాయి. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధి సమర్థవంతంగా తగ్గిపోతోంది. 

కానీ, పరిశోధకులు ఈ విషయంలో హెచ్చరిస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తేసి సాధారణ జీవితాన్ని ప్రారంభిస్తే.. మళ్లీ కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తివేతతో ఎదురయ్యే విపత్కర పరిణామాలపై ప్రభుత్వాలు నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు అంటున్నారు. భౌతిక దూరం, ప్రవర్తనా మార్పు వంటి నియంత్రణ విధానాలను కొంతకాలం కొనసాగించాల్సి ఉంటుంది.

ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తూనే వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాక్సీన్లు అందుబాటులోకి వచ్చేంత వరకు ఈ నియంత్రణ చర్యలు అమల్లో ఉండటమే శ్రేయస్కరమని చెబుతున్నారు. లాన్సెట్ మెడికల్ జర్నల్ లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. చైనాలో కరోనా పుట్టిన హుబే ప్రావిన్స్ లో కంటే, ప్రధాన భూభాగమైన చైనాలో మరణాల రేటు 1 శాతం కన్నా తక్కువగా ఉన్నట్టు తెలిపింది.  ఇక్కడి మరణాల రేటు కూడా దాదాపు 6శాతంగా ఉందని తెలిపింది.

బీజింగ్, షాంఘై, షెన్‌జెన్, వెన్‌జౌ, హుబే వెలుపల ఉన్న పది ప్రావిన్స్‌లు అత్యధిక సంఖ్యలో కేసులతో జనవరి మధ్య ఫిబ్రవరి 29 మధ్య ధ్రువీకరించారు. కోవిడ్ -19 కేసుల స్థానిక ఆరోగ్య కమిషన్ డేటాను విశ్లేషించింది. వైరస్ వ్యాప్తిపై నియంత్రణలను క్రమంగా మాత్రమే సడలించాల్సి ఉంటుందని సూచిస్తోంది. అప్పుడే కరోనాను నియంత్రించడం సాధ్యపడుతుందని రీసెర్చర్లు అభిప్రాయపడుతున్నారు. వ్యాక్సీన్లు వచ్చేంతవరకు ఈ నియంత్రణ చర్యలను సడలింపుతో కొనసాగిస్తూ కరోనాను కట్టడి చేయడం ఒక్కటే మార్గమని పరిశోధకులు సూచిస్తున్నారు.