Lunar Eclipse : 19న అకాశంలో అద్భుతం.. ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం

ఈ నెల 19న ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది. ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది పాక్షిక చంద్రగ్రహణమే అయినా ఏకంగా 3 గంటల 28 నిమిషాల పాటు కనువిందు చేయనుంది.

Lunar Eclipse : 19న అకాశంలో అద్భుతం.. ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం

Lunar Eclipse

Lunar Eclipse : ఈ నెల 19న ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది. ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది పాక్షిక చంద్రగ్రహణమే అయినా ఏకంగా 3 గంటల 28 నిమిషాల పాటు కనువిందు చేయనుంది. ఇది భారత్ లోనూ కనిపిస్తుంది. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అసోం తదితర ప్రాంతాల్లో చూడొచ్చు.

ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 18,19 తేదీల్లో వివిధ సమయాల్లో ఈ గ్రహణం కనిపిస్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం నవంబర్ 19న  మధ్యాహ్నం ఒంటి గంట 30 నిమిషాలకు చంద్రుడు, సూర్యుడికి మధ్య భూమి ఒకే వరుసలో వచ్చి.. భూమి నీడ అసంపూర్తిగా చంద్రుడిపై పడి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది.

Obesity medicine : ఊబకాయం తగ్గించే ఇంజెక్షన్..ఎగబడుతున్న జనాలు..

ఈ పాక్షిక చంద్రగ్రహణాన్ని ఉత్తర అమెరికా ఖండంలోని దేశాల వారు పూర్తిగా వీక్షించొచ్చు. అంతేకాదు, మెక్సికోలోనూ ఇది దర్శనమిస్తుంది. దీన్ని ఫ్రాస్ట్ మూన్ (మంచుతో కప్పబడిన చంద్రుడు) అని పిలుస్తారని నాసా వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాదికి ఇదే చివరి చంద్రగ్రహణం.

ఈ సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణాన్ని ప్రజలు చూసేందుకు వాతావారణం అనుకూలంగా ఉంటే ప్రత్యక్ష ప్రసారం చేస్తామని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తప్పకుండా ఇళ్లలో నుంచి బయటికి వచ్చి అద్భుతమైన దృశ్యాన్ని చూడాలని నాసా కోరుతోంది. అమెరికా తూర్పు తీరంలో ఈ అద్భుతాన్ని తెల్లవారుజామున 2 నుండి 4 గంటల వరకు చూడొచ్చు. పశ్చిమ తీరంలో ఉన్నవారు రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట మధ్య ఈ అద్భుతాన్ని వీక్షించే అవకాశముందని నాసా చెబుతోంది. ఈ పాక్షిక చంద్రగ్రహణం ఉత్తర, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్‌ ప్రాంతంలోని ప్రజలకు కూడా దర్శనమివ్వబోతోంది.

Ladyfinger : రక్త సరఫరా మెరుగు పరిచి…శ్వాసకోశ సమస్యల్ని దూరం చేసే బెండకాయ

నాసా అంచనాల ప్రకారం… పాక్షిక చంద్రగ్రహణం ఈ నెల పౌర్ణమితో పాటు కలిసి రానుంది. దీనిని మంచుతో కప్పబడిన చంద్రుడిగా (ఫ్రాస్ట్‌ మూన్‌) కూడా వ్యవహరిస్తున్నారు. శరద్ రుతువు చివరిలో ఏర్పడే మంచు కారణంగా దానికి ఆ పేరు వచ్చినట్లు తెలుస్తోంది. శరద్ రుతువు చివరి పౌర్ణమి కూడా ఇదే.

గ్రహణం టైంలో చంద్రుని ఉపరితలం మొత్తం 97 శాతం ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే చంద్రుడు ఎవరికీ కనిపించకుండా ఈ పాక్షిక గ్రహణం దాచేస్తుంది. ఈ ఏడాది తొలి చంద్ర గహణం.. మే 26 రోజున ఏర్పడింది. నిండు చంద్రుడు ఆ రోజు అరుణవర్ణంలో కనువిందు చేశాడు. దీన్నే బ్లడ్‌ మూన్, సూపర్ మూన్ అని పిలుస్తారు.