కథ అడ్డం తిరిగింది.. గ్లూతో గేమ్స్ ఆడాడు, పెదవి పొగొట్టుకున్నాడు

కథ అడ్డం తిరిగింది.. గ్లూతో గేమ్స్ ఆడాడు, పెదవి పొగొట్టుకున్నాడు

man tries Gorilla Glue challenge: గొరిల్లా గ్లూ(Gorilla Glue).. అత్యంత శక్తిమంతమైన జిగురు(గమ్). ఇప్పుడీ గ్లూ కారణంగా చాలామంది పీకల్లోతు కష్టాల్లో పడుతున్నారు. గ్లూ జోలికెళ్లి ఆసుపత్రి పాలవుతున్నారు. ఇటీవల టెస్సికా బ్రౌన్‌ అనే అమ్మాయి హెయిర్‌స్టైల్‌లో ప్రయోగం చేద్దామని గొరిల్లా గ్లూని తలపై పూసుకుంది. అంతే, జుట్టు మొత్తం అతుక్కుపోయింది. ఆ గ్లూ ఎంతకీ తొలగకపోవడంతో ఆస్పత్రిపాలైంది. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. గ్లూను ఓ యువకుడు ప్లాస్టిక్‌ కప్‌కి రుద్ది.. దాన్ని పెదాలకు అతికించి తీసేద్దామనుకున్నాడు. కానీ, అది గట్టిగా అతుక్కుపోవడంతో హాస్పిటల్ పాలయ్యాడు. సర్జరీ చేసి అతడి పెదాలను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇటీవల లూసియానాకు చెందిన టెస్సికా బ్రౌన్‌ అనే అమ్మాయి హెయిర్‌స్టైల్‌లో ప్రయోగం చేద్దామని హెయిర్ స్ప్రేకి బదులుగా గొరిల్లా గ్లూ స్ప్రేను తలపై చల్లుకుంది. దీంతో జుట్టు మొత్తం తలకు అతుక్కుపోయింది. ఆ గ్లూ ఎంతకీ తొలగకపోవడంతో ఆస్పత్రిపాలైంది. డాక్టర్లు ఆమె తలపై గ్లూను తీసేశారు. అయితే చికిత్స నిమిత్తం టెస్సికాకు 12వేలకుపైగా డాలర్లు ఖర్చయిందట. వైద్య ఖర్చుల కోసం ఆమె నెటిజన్లు ఆర్థికసాయం కూడా కోరింది.

అయితే, కొందరు నెటిజన్లు ఆమె మాటలను అస్సలు నమ్మలేదు. ఆమె అబద్దం చెబుతోందన్నారు. గ్లూ అంటించుకుంటే వైద్య చికిత్సకు అంత ఖర్చవుతుందా? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే లూసియానాకే చెందిన లెన్‌ మార్టిన్‌ అనే నెటిజన్‌ టెస్సికా అబద్ధం చెబుతోందని, గ్లూ అంటినా సులభంగా తొలగించుకోవచ్చని నిరూపించాలనుకున్నాడు.

ఇందులో భాగంగా గొరిల్లా గ్లూను ఒక ప్లాస్టిక్‌ కప్‌కు రుద్ది.. దాన్ని పెదాలపై పెట్టుకున్నాడు. కప్‌ పెదాలకు అంటుకుపోయింది. ఆ తర్వాత పెదాలను, కప్‌ను వేరు చేయడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో మార్టిన్‌ బిత్తరపోయాడు. మరో మార్గం లేక అతడు కూడా ఆస్పత్రిలో చేరాడు. తను చేసిన ప్రయోగం వీడియో, ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో తీసిన ఫొటోలను మార్టిన్‌ సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు.

‘ఈ ప్రయోగం విజయవంతం అవుతుందని భావించా. కానీ, బెడిసికొట్టింది. డాక్టర్లు ఇప్పుడు నా పెదవిని తొలగిస్తారట. నా కోసం దేవుడ్ని ప్రార్థించండి’ అని వేడుకున్నాడు. మార్టిన్ చేసిన పనిపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ‘అనవసర ప్రయోగాలు ఎందుకు’, ‘తెలివి తక్కువ పని చేసి మమ్మల్ని దేవున్ని ప్రార్థించమంటావా?’ ‘నీకు తగిన శాస్తి జరిగింది’ అని మండిపడుతున్నారు.

“It went from scary to terrifying to pretty much being tortured,” Ms. Brown, 40, said in an interview on Thursday.

నెల రోజుల తర్వాత బ్రౌన్ తన తల మీద ఉన్న గ్లూని తొలగించుకోగలింది. లాస్ ఏంజిల్స్ ప్లాస్టిక్ సర్జన్ గ్లూని తొలగించారు. ఓ సాల్వంట్ వాడి కొన్ని గంటల పాటు శ్రమించి బ్రౌన్ తల మీద అతుక్కుపోయిన గ్లూని తొలగించారు. ఇప్పుడు బ్రౌన్ రిలాక్స్ అయ్యింది. హమ్మయ్య అని ఊపిరిపీల్చుకుంది. డాక్టర్ కి ఆమె థ్యాంక్స్ చెప్పింది. చాలా భయానకం, నరకం చూశాను, ఈ అనుభవాన్ని నా జీవితంలో మర్చిపోలేను అని తన అనుభవాన్ని పంచుకుంది 40ఏళ్ల టెస్సికా బ్రౌన్.

 

View this post on Instagram

 

A post shared by Len Martin (@lenise_martin3)

 

View this post on Instagram

 

A post shared by Len Martin (@lenise_martin3)