అదో సంప్రదాయం : ఇల్లు కట్టిచ్చి ప్రేమించుకోమంటారు

  • Edited By: veegamteam , February 12, 2019 / 09:06 AM IST
అదో సంప్రదాయం : ఇల్లు కట్టిచ్చి ప్రేమించుకోమంటారు

కంబోడియా: ప్రపంచ వ్యాప్తంగా ఉండే గిరిజన..ఆదివాసీల సంప్రదాయాలన్నీ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. సంప్రదాయాలను పాటించటంలో గిరిజనులది ఓ ప్రత్యేకమైనవారిగా చెప్పవచ్చు. ఈ క్రమంలో తమకు పుట్టిన సంతానం విషయంలో కూడా వారు కొన్ని పద్ధతులను పాటిస్తుంటారు. ముఖ్యంగా వారి ప్రేమ, వివాహం వంటి విషయాలలో సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా ‘ప్రేమ విలువ ప్రేమలో పడినవారికీ ప్రేమలో బతికిన వారికీ మాత్రమే తెలుస్తుంది’ అనే విషయాన్ని కంబోడియాలోని క్రెయంగ్‌ తెగ ప్రజలు గట్టిగా నమ్ముతుంటారు. దానికి అవసరమైన ఏర్పాట్లను కూడా తల్లిదండ్రులు వారి పిల్లల విషయంలో పాటిస్తుంటారు. మరి ఆ వివరాలేమిటో తెలుసుకుందాం..

 

పిల్లలు ప్రేమించుకుంటే వద్దనే తల్లిదండ్రులను చూస్తుంటాం..కానీ పిల్లలు ప్రేమను ప్రోత్సహించే ఈ గిరిజన సంప్రదాయం చాలా చాలా ప్రత్యేకమైనది చెప్పక తప్పదు. కంబోడియాలోని క్రెయంగ్ తెగ గిరిజనుల అమ్మాయికి పదిహేనేళ్లు రావడం ఆలస్యం, తండ్రి ఆమెకోసం ఇంటి వెనక భాగంలో ఓ ప్రేమ కుటీరం లాంటి ఓ చిన్న ఇంటిని కట్టిస్తాడు. అంతేకాదు, ‘నీకు ప్రేమలో పడే వయసొచ్చింది. నీ మనసుకు నచ్చినవారినెవర్నైనా ఇక్కడికి తీసుకు తెచ్చుకో..వారితో స్నేహం చేస్తావో సహజీవనం చేస్తావో నీ ఇష్టం. నువ్వు నిజంగా ప్రేమలో పడితే మాత్రం చెప్పు. పెళ్లి చేస్తాం’ అని వారి వారి కుమార్తెలకు చెబుతారు తల్లిదండ్రులు.

 

క్రెయింగ్ గిరిజనులు ప్రేమకు తప్ప ఆస్తులూ అంతస్తులకు విలువ ఇవ్వరు. కలిసి బతికినపుడే ఒకరిలోని మంచి చెడులు మరొకరికి తెలుస్తాయనీ..ఇద్దరి మధ్యా ఉన్నది ప్రేమా ఆకర్షణా అన్న విషయమూ అర్థమవుతుందనీ..పెళ్లికి ముందే ఇదంతా తెలుసుకునే అవకాశం పిల్లలకిస్తే సరైన భాగస్వామి దొరికాకే పెళ్లి చేసుకుంటారని పెద్దలు నమ్ముతారు. ఇలా అర్థం చేసుకుంటే వారి బంధం కలకాలం నిలిచి ఉంటుందనేది వారి నమ్మకం. అక్కడ విడాకులు తీసుకునే జంటలు చాలా అరుదు అంటేనే తెలుస్తుంది వారి నమ్మిన సంప్రదాయాలకు వారు ఎంతగా విలువ ఇస్తారో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో తమ దగ్గరికి వచ్చే అబ్బాయితో స్నేహం చెయ్యాలా సహజీవనం చెయ్యాలా అన్నది పూర్తిగా అమ్మాయిల ఇష్టమే జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా అబ్బాయిలు ప్రవర్తించడానికి అసలే వీల్లేదు..అది వారి నిబంధన. కొంతకాలం స్నేహం తర్వాత అతడు ఆమెకు నచ్చకపోతే ‘ఇక, నా ఇంటికి రావొద్దు’ అని చెప్పేసే స్వేచ్ఛ కూడా అక్కడ అమ్మాయిలకు ఉంది. ఇలా పెద్దల అంగీకారంతో తాము ఇష్డపడిన అబ్బాయిల్ని పెళ్లి చేసుకుని సంతోషంగా కాపురం చేసే జంటలు క్రెయింగ్ గిరిజనుల్లో ఎన్నో..ఎన్నోన్నో ఉన్నాయి. 

ప్రేమిస్తే చంపేస్తాం..కులంకానివాడిని పెళ్లి చేసుకుంటే చంపేసే నాగరిక సంప్రదాయాలు అనాగరికులు అని చెప్పుకునే గిరిజనుల్లో లేవు అంటే నాగరికులం మనమా..లేక గిరిజనులా అని ప్రశ్న నాగరికులు అని చెప్పుకునే ప్రతీ ఒక్కరూ వేసేకోవాల్సిన ప్రశ్న.