క్రిస్మస్ గిఫ్టుగా గర్ల్ ఫ్రెండుకు ఫ్యామిలీ DNA రిపోర్టు..బైటపడ్డ 30 ఏళ్లనాటి సీక్రెట్..

క్రిస్మస్ గిఫ్టుగా గర్ల్ ఫ్రెండుకు ఫ్యామిలీ DNA రిపోర్టు..బైటపడ్డ 30 ఏళ్లనాటి సీక్రెట్..

lover gives christmas gift for girlfriend mother 30 years of illegal affair : ఓ ప్రియుడు తన ప్రియురాలికి క్రిస్మస్ పండుగ కోసం వినూత్నమైన గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. అలా క్రిస్మస్ పండుగ కోసం ఇచ్చిన ఆ బహుమతి ఓ కుటుంబంలో షాకింగ్ విషయాలు బైటపడ్డాయి. ఆనందం పంచటానికి ఓ అమ్మాయికి ఆమె ప్రియుడు ఇచ్చిన క్రిస్మస్ గిఫ్టు కుటుంబంలో గందరగోళం సృష్టించిన ఆ రియల్ స్టోరీలో జరిగిందేంటో చూద్దాం..

అందరూ ఇచ్చే కానులకలు కంటే తన గర్ల్ ఫ్రెండ్​కు డిఫరెంట్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడో ప్రియుడు. అలా తన గర్ల్ ఫ్రెండ్ కుటుంబానికి సంబంధించిన అందరి డీఎన్ఏ రిపోర్టును క్రిస్మస్ గిఫ్టుగా ఇచ్చాడు. ఈ డీఎన్ ఏ రిపోర్టుల్లో ఆ అమ్మాయి తల్లి రిపోర్టు కూడా ఉంది. ఆ రిపోర్టులో ఆమె తల్లికి గతంలో ఓ అక్రమ సంబంధం (వివాహేతర సంబంధం) ఉందని తేలింది..!! ఎప్పుడో 30 ఏళ్ల క్రితం తన తల్లికి వేరే వ్యక్తితో ఉన్న సంబంధం తెలుసుకున్న ఆ అమ్మాయి షాక్ అయ్యింది. లవర్ ఇచ్చిన ఆ గిఫ్టుతో 30 ఏళ్ల నుంచి ఎంతో గుట్టుగా ఉన్న తల్లి సంబంధం సీక్రెట్ బయటపడింది.

తన తల్లి తన తండ్రి ద్వారా కాకుండా వేరే వ్యక్తి వల్ల గర్భవతి అయ్యిందనీ..ఆ గర్భం ద్వారా ఓ ఆడపిల్లకు జన్మనిచ్చిందనే 30ఏళ్ల క్రితం నాటి సీక్రెట్ ఈ డీఎన్ఏ పరీక్షల రిపోర్టు గిఫ్టు ద్వారా ఆ అమ్మాయికి తెలిసింది. దీంతో ఒక్కసారిగా షాకైపోయింది.

తన లవర్ తనను సర్​ ప్రైజ్ చేద్దామని, ఈ డీఎన్ఏ రిపోర్టు బహుమతి ఎంతో గొప్పగా నిలిచిపోతుందని తాను ఆలోచించింది. కానీ అదే గిఫ్టు తనకు ఇలా షాక్ ఇస్తుందని ఆమె అనుకోలేదు. అదే విషయాన్ని ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో చెప్పగా..అతను తాను అనుకున్న దానికి రివర్స్ అయిందని సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెలిపాడు. ఈ విషయం తనకు కూడా షాక్ ఇచ్చిందని తెలిపాడు.

ఈ విషయం గురించి సదరు లవర్..తాను తన ప్రియురాలికి ఇచ్చిన డీఎన్​ఏ పరీక్ష ఫలితాల్లోని హెల్త్ సెక్షన్​ను చూసిందనీ అదంతా సవ్యంగానే ఉందనీ..కానీ ఆ తరువాత ఆమె తన ఫ్యామిలీ సెక్షన్​లోకి వెళ్లి చూడగా..తాత, నానమ్మ ఇలా బంధాల గురించి తెలుసుకుంది. అవన్నీ చక్కగానే ఉన్నాయి.

అయితే దాంట్లో హాఫ్ సిస్టర్ అని వచ్చింది..హాఫ్ సిస్టర్ అంటే తన తల్లిదండ్రులకు కాకుండా.. ఇద్దరిలో ఒకరికి బయటి వ్యక్తితో సంబంధం ద్వారా పుట్టిన సోదరి అని అర్థం. తన తల్లి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం నడపడంతో తనకు ఓ హాఫ్ సిస్టర్ ఉందని ఆ గర్ల్ ఫ్రెండ్ అర్థం చేసుకుంది.

తన హాఫ్ సిస్టర్ ఎవరా అని నా గర్ల్ ఫ్రెండ్ తీవ్రంగా ఆలోచించింది. అయితే తన ఫ్యామిలీ సర్కిల్ లో ఉండేవారి గురించి ఆలోచించింది. అలా తన సర్కిల్ లో ఉన్నవారినందరినీ గుర్తు తెచ్చుకోగా..ఓ అమ్మాయి పోలికలు సరిపోవడంతో ఆమె తండ్రి పేరు ఎవరో తెలుసుకుంది. తికమక పడింది. ఆ తర్వాత తల్లికి ఫోన్ చేసింది.

ఓ రూమ్​లో స్పీకర్ పెట్టుకొని మేం మాట్లాడాం. అప్పుడు మీకు జాన్ స్మిత్ తెలుసా అని ఆ అమ్మాయి తల్లిని డైరెక్ట్ గా అడిగింది. దీంతో ఫోన్ సైలెంట్ అయిపోయింది. అమ్మాయి తల్లి కూతురు అలా సడెన్ గా అడిగేసరికి ఏం చెప్పాలో తెలీక సీరియస్ అయింది. ఆయన గురించి నీకెందుకని కోపంగా అడిగింది. దాంతో అసలు విషయాన్ని తల్లిద్వారా తెలుసుకుని నా గర్ల్ ఫ్రెండ్ కన్ఫామ్ చేసుకుంది.

కాసేపటి తర్వాత మళ్లీ కాల్ చేసిన ఆమె తల్లి.. కూతురితో ‘‘ఈ విషయాన్ని మీ నాన్నను అడిగావా? లేదా మీ నాన్నకు చెప్పావా అని అడిగిందని బాయ్ ఫ్రెండ్ కు ఆమె చెప్పింది. ఈ విషయాన్ని ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియని నా గర్ల్ ఫ్రెండ్ నాకు వివరంగా చెప్పింది. తమకు ఓ హాఫ్ సిస్టర్ ఉందని, అయితే ఆమె తండ్రి జాన్ అని చెప్పిందని సదరు బాయ్ ఫ్రెండ్ తెలిపాడు.

30ఏళ్లుగా తన తల్లి ఈ విషయాన్ని(జాన్​తో అక్రమ సంబంధం) రహస్యంగా ఉంచింది. ఇప్పుడు ఈ క్రిస్మస్ కు ఇచ్చిన డీఎన్ ఏ పరీక్షల గిఫ్టు ద్వారా 30 ఏళ్లనుంచి పెట్టినట్లుగా సదరు కూతురు తెలుసుకుంది. ఈ విషయాలను బాయ్ ఫ్రెండ్ తో చెప్పి..ఈ డీఎన్ ఏ వివరాల్ని ఎవ్వరికీ చెప్పొద్దని..నా గర్ల్ ఫ్రెండ్ చెప్పిందనీ..ఇటువంటి క్రిటికల్ సిట్యువేషన్ ఎదురవుతుందని ఏమాత్రం ఊహించన తన గర్ల్ ఫ్రెండ్ ఏం చేయాలో తెలియక సతమతమవుతోంది” అని సోషల్ మీడియా పోస్టులో సదరు బాయ్ ఫ్రెండ్ రాసుకొచ్చాడు.