ప్రపంచంలోనే అతి చిన్న ఊసరవెల్లి..అగ్గిపుల్ల కొనంత చిన్నగా భలే ఉంది..

ప్రపంచంలోనే అతి చిన్న ఊసరవెల్లి..అగ్గిపుల్ల కొనంత చిన్నగా భలే ఉంది..

Madagascar World’s smallest Chameleon : ప్రపంచంలోనే అతి చిన్న ఊసరవెల్లిని పరిశోధకులు గుర్తించారు. హిందూమహాసముద్రంలో ఉన్న ద్వీప దేశం అయిన మడగాస్కర్ లో ఒక చిన్న మగ ఊసరవెల్లిని గుర్తించారు. ఈ ఊసరవెల్లి ప్రపంచంలోని అతి చిన్న సరీసృపంగా గుర్తించబడింది.ఈ చిన్న ఊసరవెల్లి ముక్కు నుండి చివర వరకు (తోకను లెక్కించకుండా) అర అంగుళం (13.5 మిల్లీమీటర్లు) మాత్రమే ఉంది. ఇది మన వేలి కొనమీద నిలబెడితే చిన్న బొమ్మలా కనిపిస్తుంది. ఈ చిన్న ఊసరవెల్లిని అగ్గిపుల్ల చివరన అతికించిన భాస్వరం మీద కూడా నిలబెట్టవచ్చు.

ఇక ఈ జాతిలో మగ ఊసరవెల్లితో పోలిస్తే, ఆడ ఊసరవెల్లి కొంచెం పొడుగా 29 మిల్లీ మీటర్లు ఉంటుందని తెలిపారు. వీటిని మైక్రో సిటీ స్కాన్, త్రీ డైమన్షనల్ ఎక్స్ రే సాయంతో పరిశీలించామని, ఆడ ఊసరవెల్లిలో రెండు గుడ్లు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు.  ఈ ఊసరవెల్లిని ఇటీవల ముంచెన్‌లోని జూలాగిస్చే స్టాట్సామ్‌లంగ్‌లో పనిచేస్తున్న జర్మన్ హెర్పెటాలజిస్ట్ ఫ్రాంక్ గ్లా నేతృత్వంలోని పరిశోధకుల బృందం కనిపెట్టింది.ఈ బృందంలో ఓ పరిశోధకుడు మాట్లాడుతూ..మడగాస్కర్ అరుదైన ప్రాణులకు ఆవాసమని తెలిపారు. 200 కు పైగా జాతులను కనిపెట్టామని తెలిపారు. వాటిలో చాలా వాటికి పేర్లు పెట్టామని తెలిపారు. 2012 లో..మడగాస్కర్‌లోని నోసీ హరా ద్వీపానికి చెందిన మరొక చిన్న సరీసృపాన్ని గుర్తించామని బ్రూకేసియా మైక్రోను గ్లా వివరించారు. ప్రపంచంలోనే అతి చిన్న ఊసరవెల్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాగా మడగాస్కర్ అద్భుతమైన వన్యప్రాణులకు నిలయం.అద్భుతమైన బీచ్‌లు, మనోహరమైన సంస్కృతి మడగాస్కర్ సొంతం. మడగాస్కర్ దీవిలో మొత్తం 18 రకాల తెగల ప్రజలు నివసిస్తున్నారు. తెగలు వేరున్నా అందరూ మాట్లాడేది మలగాసీ భాషనే. ఈ దీవి వైశాల్యంలో ప్రపంచంలోనే నాల్గవ స్థానంలో ఉంది. క్రీ.శ. 1500లో పోర్చుగీసువారు ఈ దీవిని మొదట కనుగొన్నారు. ఈ దీవిలో ప్రాణుల ఉనికి 150 మిలియన్ సంవత్సరాల క్రితం నుండే ఉండేదని శాస్రవేత్తలు పరిశోధించారు.