న్యూజిల్యాండ్‌లో భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ

న్యూజిల్యాండ్‌లో భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ

New Zealand న్యూజిల్యాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 3;34గంటల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.2గా నమోదైంది. న్యూజీల్యాండ్ తీరప్రాంత నగరం గిస్‌బార్న్‌కు ఈశాన్యాన 180 కిలోమీటర్ల దూరంలో, 10 లోతున భుకంప కేంద్రం ఉన్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా ఏర్పడిన నష్టం ఎంత అన్నది ఇంకా తెలియరాలేదు.

ప్రాథమిక అంచనా ప్రకారం.. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల దూరం వరకూ సునామీ ప్రమాదం ఉందని అని హవాయ్‌లోని సునామీ హెచ్చరికల కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. తీర ప్రాంతాల్లో భూమి కంపిచనట్లయితే అక్కడున్న వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని జాతీయ ఎమర్జెన్సీ నిర్వహణ ఏజెన్సీ(NEMA) న్యూజిల్యాండ్ ప్రజలకు సూచించింది.