British Airways Uniform : బ్రిటిష్ ఎయిర్ వేస్ కొత్త యూనిఫామ్.. మహిళలు హిజాబ్ ధరించేలా భారీ మార్పులు

బ్రిటిష్ ఎయిర్ వేస్ కొత్త యూనిఫామ్ తీసుకొచ్చింది. 20 ఏళ్ల తర్వాత యూనిఫామ్ లో భారీ మార్పులు చేసింది. కేబిన్ క్రూలోని మహిళలు హిజాబ్ ధరించేలా మార్పులు చేసింది. పురుషులకు త్రీ పీస్ సూట్లు ధరించే ఛాన్స్ కల్పించింది.

British Airways Uniform : బ్రిటిష్ ఎయిర్ వేస్ కొత్త యూనిఫామ్.. మహిళలు హిజాబ్ ధరించేలా భారీ మార్పులు

British Airways

British Airways Uniform : బ్రిటిష్ ఎయిర్ వేస్ కొత్త యూనిఫామ్ తీసుకొచ్చింది. 20 ఏళ్ల తర్వాత యూనిఫామ్ లో భారీ మార్పులు చేసింది. కేబిన్ క్రూలోని మహిళలు హిజాబ్ ధరించేలా మార్పులు చేసింది. పురుషులకు త్రీ పీస్ సూట్లు ధరించే ఛాన్స్ కల్పించింది. ప్రఖ్యాత బ్రిటన్ ఫ్యాషన్ డిజైనర్ ఓజ్వాల్డ్ బోటెంగ్ ఈ యూనిఫామ్ ను రూపొందించారు. యూనిఫామ్ మార్పులపై బోటెంగ్ బృందం మూడేళ్లపాటు పరిశోధనలు చేసింది.

వాస్తవానికి ఈ మార్పులు 2021లో తీసుకురావాల్సిన ఉండగా కరోనా కారణంగా రెండేళ్లు ఆలస్యం అయింది. బ్రిటిష్ ఎయిర్ వేస్ తమ వద్ద పనిచేసే మహిళా సిబ్బందికి యూనిఫామ్ లో అనేక ఆప్షన్లు ఇచ్చింది. వీటిలో హిజాబ్, జంఫ్ సూట్, డ్రెస్, స్కర్ట్, ట్రౌజర్ వంటివి ఉన్నాయి. జంప్ సూట్ ను మొదట మహిళా చెక్ఇన్ సిబ్బందిపై పరీక్షించనున్నారు.

Indian Air Force : భార‌త వైమానిక ద‌ళంలో కొత్త‌గా వెప‌న్ సిస్ట‌మ్ బ్రాంచ్.. స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత ఇదే తొలిసారి

అనంతరం ఈ ఏడాది మధ్యలో క్యాబిన్ క్రూలోని మహిళలు ధరించేలా చర్యలు తీసుకోనున్నారు. బ్రిటిష్ ఎయిర్ వేస్ లో మొత్తం 30 వేల మంది సిబ్బంది పని చేస్తున్నారు. తమ కొత్త యూనిఫామ్ ప్రత్యేకమైన బ్రాండ్ కు ప్రాతినిధ్యం వహిస్తోందని బ్రిటిష్ ఎయిర్ వేస్ చైర్మన్, సీఈవో సీన్ డోయల్ తెలిపారు. ఆధునిక బ్రిటన్ ను సూచిస్తుందని చెప్పారు.

బ్రిటన్ కు చెందిన వర్జిన్ అట్లాంటిక్ విమానయాన సంస్థ సైతం గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో తమ యూనిఫామ్ లో మార్పులు తీసుకొచ్చింది. మగ పైలట్, సిబ్బందికి స్కర్టులు ధరించే వెసులుబాటును కల్పించింది. అలాగే మహిళలు ప్యాంట్స్ ధరించేలా వెసులుబాటు ఇచ్చింది. లింగ భేదం లేకుండా ఉంచేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్ లైన్స్ పేర్కొంది.