5G Network : 5జీ సేవలతో విమానయాన రంగం దెబ్బతింటుంది
ఇంటర్నెట్ వినియోగంలో వేగం పెంచేందుకు రూపోందించిన 5జీ సేవలు విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతాయని అమెరికాకు చెందిన పలు విమానయాన సంస్ధలు ఆందోళన వ్యక్తం చేశాయి.

5 G Services
5G Network : ఇంటర్నెట్ వినియోగంలో వేగం పెంచేందుకు రూపోందించిన 5జీ సేవలు విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతాయని అమెరికాకు చెందిన పలు విమానయాన సంస్ధలు ఆందోళన వ్యక్తం చేశాయి. అమెరికాలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న 5జీ సీ బ్యాండ్ సేవలతో అనేక విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోతాయని వారు తెలిపారు.
5జీ సీ బ్యాండ్ వల్ల విమానాల రాకపోకల్లో గందరగోళం తలెత్తుతుందని తెలుస్తోంది. ఏటీఅండ్‌టీ, వెరిజోన్ సంస్ధలు సంయుక్తంగా బుధవారం నుంచి అమెరికాలో 5 జీ సేవలను ప్రారంభిస్తున్నాయి. ఇవి ప్రారంభమైన 36 గంటల్లోగా విమానయాన రంగంలో సంక్షోభం ఏర్పడుతుందని అమెరికా పౌర,సరుకు రవాణా విమాన సేవల సంస్ధలు పేర్కోన్నాయి.
విమానాల్లో ఉండే సున్నితమైన ఆల్టీమీటర్లను 5 జీ సేవలు ప్రభావితం చేసే అవకాశం ఉందని ఎఫ్ఏఏ హెచ్చరించింది. లో విజన్ లో కార్యకలాపాలు సాగించే విమానాలు పూర్తిగా నిలిచిపోతాయని పేర్కోంది. దీని ప్రభావంతో వందలాది విమానాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. వేలాది మంది అమెరికన్లు ఎక్కడి కక్కడే చిక్కుకుపోతారని విమానయాన సంస్ధలు పేర్కోన్నాయి.
ఈ మేరకు అమెరికన్ ఎయిర్ లైన్స్, డెల్టా ఎయిర్ లైన్స్, యూనైటెడ్ ఎయిర్ లైన్స్, సౌత్‌వెస్ట్ ఎయిర్ లైన్స్, అలస్కా ఎయిర్ వేస్‌తో సహ పలు సంస్ధలు వైట్‌హౌస్ జాతీయ ఆర్ధిక మండలి డైరెక్టర్, రవాణా కార్యదర్శి, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, ఫెడరల్ కమ్యూనికేషన్ కమీషన్ చైర్ ఉమన్‌లకు లేఖ రాశాయి.
5జీ సేవలు మొదలైతే బుధవారం నుంచి అమెరికాకు రావల్సిన అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేయాలని పలు విమానయాన సంస్ధలు యోచిస్తున్నాయి. ఈ సమస్యపై ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని విమాన తయారీ సంస్ధ బోయింగ్ తెలిపింది.
ఎయిర్‌పోర్టు రన్‌వే లకు 3.2 కిలోమీటర్లు దూరంలో 5జీ సేవల టవర్లు లేకుండా చూడాలని విమానయాన సంస్ధలు కోరాయి. 5జీ సేవల వల్ల దేశీయ వాణిజ్యం బాగా దెబ్బ తింటుందని విమానయాన సంస్ధలు చెపుతున్నాయి.
Also Read : UP Polls : శ్రీకృష్ణుడు పెద్ద రాజకీయ నాయకుడు…మేము ఆయన వద్ద రాజకీయాలు నేర్చుకున్నాము
అమెరికాలో 5జీసేవలను ప్రారంభిస్తున్న ఏటీఅండ్‌టీ, వెరిజోన్ సంస్ధలు 50 విమానాశ్రయాల చుట్టూ ఉన్న బఫర్ జోన్లలో టవర్లు ఏర్పాటు చేయకుండా ఉండేందుకు అంగీకరించాయి. విమానయాన రంగంలో ప్రతిష్టంభనను తొలగించేందుకు తమ సేవలను కొంతకాలం వాయిదా వేసుకునేందుకు కూడా ఆ సంస్ధలు మొదట అంగీకరించాయి.