వీడియో: షాండియర్‌లా వేలాడే వెడ్డింగ్ కేకు! ప్లానర్ ఎక్స్‌లెంట్ ఐడియా!!

10TV Telugu News

కేకును కట్ చేయాలంటే ఏం చేస్తారు? అదో పెద్ద విషయమా ఏంటీ..టేబుల్ పై పెట్టి కట్ చేస్తారు. కానీ షాండియర్ లా గాల్లో వేలాడుతూ..ఏదో అద్భతం కిందకు దిగుతున్నట్లుగా గాల్లో తేలియాడే కేక్ గురించి బహుశా చూసి ఉండరు. వినికూడా ఉండరు.

మలేషియాకు చెందిన ఓ వెడ్డింగ్ ప్లానర్..ఐడియా చూసి ఎక్స్ లెంట్..మార్వలెస్ ఐడియా అంటూ తెగ ఆశ్చర్యపోతున్నారు ఈ షాండియర్ లాంటి కేకును చూసివారు.కేకును సీలింగ్‌కు షాన్డిలియర్ లైట్ల తరహాలో వేలాడ దీసి.. ఔరా అనిపించాడు. ఆ ప్లాన్ చూసిన వధువరులతో పాటు అతిథులకు సర్‌ప్రైజ్ అయిపోయారు. ఈ అపురూపమైన వెడ్డింగ్ ప్లాన్ మలేషియా నటులు జహిరా మ్యాక్విల్సన్, ఇమాన్ హకీమ్ రెడ్జాలు పెళ్లిలో జరిగింది. 

గురువారం (ఫిబ్రవరి 20) మలేషియా నటులు జహిరా మ్యాక్విల్సన్, ఇమాన్ హకీమ్ రెడ్జాల పెళ్లిలో గెస్ట్ లను  సర్‌ప్రైజ్ చేసేందుకు వెడ్డింగ్ ప్లానర్.. కేకును షాన్డిలియర్ లైట్ల తరహాలో సీలింగ్‌లో అమర్చాడు. ఇప్పుడీ ఈ జంట కేకు కట్ చేయనుందని ప్రకటించారు. కానీ కేకు ఎక్కడా కనిపించలేదు. కేకు లేకుండా ఎలా కట్ చేస్తారని అంతా ఆశ్చర్యపోయారు. పెళ్లి కొడుకు పెళ్లికూతుళ్లు కూడా కేకు ఎక్కడా? అన్నట్లు ముఖం పెట్టారు. ధగధగలాడుతూ రంగు రంగుల లైట్లు జిగేల్ మంటూ వెలిగాయి. సీలింగ్ నుంచి కేకు నెమ్మదిగా కిందికి దిగింది. ఇదుగో  కేకు అనగానే అంతా ఆశ్చర్యపోయారు. ఈ కేకు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వెన్నెలజలతారులాంటి ముత్యాలు అతికించి షాండియర్‌లా మెరిసిపోతున్న ఈ కేకును చూసినవారు ఔరా..ఏమీ ఈ వెడ్డింగ్ ప్లానర్ ఐడియా అంటూ తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి కేకు, నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అంటున్నారు. 

ఈ కేకును కౌలాలంపూర్‌లోని లిలీ అండ్ లోలా కేక్స్ స్పెషలిస్టులు వారం రోజులు కష్టపడి  తయారు చేశారు.ఈ సందర్భంగా ఆ కేకు షాపు యజమాని లిలీ అస్మాన్ మాట్లాడుతూ.. ‘‘ఇటువంటి కేకును తయారు చేయాలని 2017లో నా చెల్లెల్లు అల్యా సలహా ఇచ్చింది. అప్పటి నుంచి అటువంటి కేకును తయారు చేయటం కోసం ఎదురు చూస్తున్నాను. ఇదిగో జహిరా మ్యాక్విల్సన్, ఇమాన్ హకీమ్ రెడ్జా వెడ్డింగ్ ఇవెంట్ ద్వారా అటువంటి అవకాశం వచ్చింది. ఈ కేకును చూసి చాలామంది ఎలా తయారు చేశారు. వాటి లేయర్స్ కిందపడకుండా, క్రీమ్ జారిపోకుండా భలే చేశారంటూ ప్రశంసిస్తుంటే భలే సంతోషంగా ఉంది.

కేకులను టేబుల్ మీద పెట్టడం చాలా ఈజీ. కానీ..సీలింగ్‌కు వేలాడదీయడమంటే మాటలు కాదు. వేలాడదీసే క్రమంలో చిన్నపాటి ఒత్తిడి తగిలినా కేకు ముక్కలైనా పడిన కష్టమంతా వృధా అయిపోతుంది. ఈ కేకును సీలింగ్‌లో వేలాడ దీయటానికి గంటల సమయం పట్టింది. ఈ షాండియర్ కేకు తయారీకి 2,400 డాలర్లు (భారత కరెన్సీలో రూ.1.71 లక్షలు) ఖర్చైందని తెలిపారు.